Education Department | సర్కారు పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం.. అడ్మిషన్​ రిజిస్టర్​ మాయం..

సర్కారు పాఠశాలలో సిబ్బంది నిర్లక్ష్యం తారాస్థాయికి చేరింది. ఏకంగా స్కూల్​లోని అడ్మిషన్​ రిజిష్టర్ మాయం అవడంపై విమర్శలు వస్తున్నాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, బోధన్: Education Department | సర్కారు పాఠశాలలో సిబ్బంది నిర్లక్ష్యం తారాస్థాయికి చేరింది. ఏకంగా స్కూల్​లోని అడ్మిషన్​ రిజిష్టర్(Admission Register) మాయం అవడంపై విమర్శలు వస్తున్నాయి.

Education Department | బోధన్​ పట్టణంలో..​

బోధన్(Bodhan) పట్టణంలోని జూనియర్​ కళాశాల ఆవరణలో ఉన్న జేసీ ఉన్నత పాఠశాలలో రిజిస్టర్​ మాయమైంది. కొన్నిరోజులుగా అడ్మిషన్​ రిజిస్టర్​ మాయమవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. విద్యాసంవత్సంరం ప్రారంభం అయిన నేపథ్యంలో అడ్మిషన్ల కోసం వచ్చే తల్లిదండ్రులకు వేరే రిజిస్టర్​ పెట్టి అడ్మిషన్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. 2019 నుంచి విద్యార్థుల పేర్లు, వివరాలను నమోదై ఉన్న రిజిస్టర్​ సుమారు 40 రోజులుగా కనిపించకపోవడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై సంబంధిత హెచ్​ఎంను వివరణ కోరగా పాఠశాలలోని సిబ్బంది కారణంగా రిజిస్టర్​ మాయమైందని.. పోలీసులకు(Bodhan Police) సైతం ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.

admisstion

ఇది కూడా చదవండి: Yoga Andhra Event | అమరావతి వేదికగా ‘యోగాంధ్ర’.. చంద్రబాబు విజన్‌ను ప్రశంసించిన బాబా రాందేవ్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *