Farmer Welfare Telangana | ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు..

ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్​ గుప్తా అన్నారు.

Shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Farmer Welfare Telangana | ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్​ గుప్తా (MLA Bigala Ganesh Gupta) అన్నారు. మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్​తో కలిసి ఆయన బీఆర్​ఎస్​ పార్టీ కార్యాలయంలో శనివారం మాట్లాడారు.

Farmer Welfare Telangana | బీఆర్​ఎస్​ హయాంలో రైతులకు ప్రాధాన్యత..

రాష్ట్ర ఏర్పాటు అనంతరం సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) నాయకత్వంలో రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని బిగాల అన్నారు. రైతు అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధి అనే సంకల్పంతో బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక వినూత్న పథకాలను అమలు చేసి దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. కేసీఆర్​ హయాంలో రైతును రాజుగా భావించి రైతు సంక్షేమం కోసం ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని గుర్తు చేశారు. రైతులకు పెట్టుబడి భారం తగ్గించేందుకు రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి ఎకరానికి ఏడాదికి రూ.10,000 చొప్పున పెట్టుబడి సహాయం అందించారని, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు రైతులకు అందుబాటులో ఉంచారని తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణకు ప్రాధాన్యతనిస్తూ ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ యంత్రాలను సబ్సిడీలపై అందించి రైతుల శ్రమను తగ్గించారని పేర్కొన్నారు.

Farmer Welfare Telangana | 24గంటల విద్యుత్​ ఇచ్చాం..

వ్యవసాయ రంగానికి 24 గంటలు ఉచిత విద్యుత్​ అందించడం ద్వారా రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగు చేసుకునే పరిస్థితులు కల్పించామని బిగాల అన్నారు. తెలంగాణ (Telangana)లో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి లక్షల ఎకరాలకు నీరందించడం ద్వారా సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందన్నారు. దేశ జనాభాలో తెలంగాణ వాటా కేవలం మూడు శాతం మాత్రమే ఉన్నప్పటికీ, దేశ ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ 50 శాతానికి పైగా వాటా సాధించి దేశానికే అన్నపూర్ణగా నిలిచిందంటే అది కేసీఆర్ వల్లే సాధ్యమైందన్నారు. రైతుబంధు పథకం ద్వారా సుమారు రూ.77 వేల కోట్ల పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని, రైతులకు రూ.27వేల కోట్లకు పైగా రుణ సదుపాయాలు కల్పించారని గుర్తు చేశారు.

Farmer Welfare Telangana | రైతు కుటుంబాల శ్రేయస్సు కోసం రైతుబీమా..

Farmer Welfare Telangana

రైతు కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బీఆర్​ఎస్​ ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టిందని మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. రైతుకు ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. ఈ పథకం కింద వేలాది కుటుంబాలకు లబ్ధి చేకూర్చడంతో పాటు రూ.6,800 కోట్లకు పైగా ఆర్థిక సాయం అందించిందని గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని గణేష్ బిగాల తీవ్రంగా విమర్శించారు. వర్షాకాలం సాగు ప్రారంభమైన సమయంలో రైతులకు సకాలంలో ఎరువులు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నప్పటికీ, ఆ బాధ్యతను విస్మరించి యాప్‌లు, ఆన్‌లైన్ విధానాల పేరుతో కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. ఎరువుల కోసం రైతులు రోజుల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇది రైతాంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ దండు నీతు కిరణ్ శేఖర్,నుడా (NUDA) మాజీ ఛైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సిర్ప రాజు, సత్య ప్రకాష్, సుజిత్ సింగ్, జగత్ రెడ్డి, బిల్లా మహేష్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: KTR Grand Welcome | పోచంపాడ్ ఎక్స్‌రోడ్ వద్ద కేటీఆర్‌కు ఘనసన్మానం..

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *