అక్షరటుడే వెబ్డెస్క్: TPCC Nizamabad Appointments | నిజామాబాద్ జిల్లాలో ఇటీవల చేపట్టిన పార్టీ నియామకాలపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) వెనక్కి తగ్గింది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.
TPCC Nizamabad Appointments | డివిజన్ అధ్యక్షులను నియమిస్తూ..
గత మే 30, 2026న నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్ , ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు డివిజన్ అధ్యక్షులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే, తాజాగా ఆ నియామకాలను రద్దు చేస్తూ లేదా నిలిపివేస్తూ (kept in abeyance) టీపీసీసీ స్పష్టం చేసింది.

TPCC Nizamabad Appointments | తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు..
టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ టి. కుమార్ రావు సంతకంతో జూన్ 18, 2026న విడుదలైన అధికారిక ఉత్తర్వుల ప్రకారం, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ నియామకాలు చెల్లవని పార్టీ స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఈ విషయంలో తదుపరి ఆదేశాలను త్వరలోనే జారీ చేస్తామని, సంబంధిత నేతలకు సమాచారం అందిస్తామని లేఖలో పేర్కొన్నారు. నిజామాబాద్ కార్పొరేషన్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణకు ఈ మేరకు టీపీసీసీ నుంచి సమాచారం అందింది. పార్టీలో అంతర్గత కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారా లేక ఏదైనా ఇతర కారణాలు ఉన్నాయా అన్నది ప్రస్తుతం స్థానిక రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. త్వరలోనే కొత్త నియామకాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
టీపీసీసీ కీలక నిర్ణయం.. వారి నియామకాలు రద్దు!
నిజామాబాద్ జిల్లాలో ఇటీవల జరిగిన పలు పార్టీ నియామకాలపై టీపీసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ నియామకాలు నిలిపివేసింది. నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు డివిజన్ అధ్యక్షులను… pic.twitter.com/YG4EZYMqii
— Akshara Today | Telugu News (@aksharatoday) June 20, 2026
ఇది కూడా చదవండి: Save The Tigers 3 Review | టైగర్స్ మళ్లీ గర్జించారు: వినోదం, ఫాంటసీల మేళవింపుగా ‘సేవ్ ద టైగర్స్-3’!