Vaibhav Suryavanshi | వైభవ్​ సూర్యవంశీ వీర విహారం

ముక్కోణపు సిరీస్​లో భాగంగా శ్రీలంక ఏ జట్టుతో జరుగుతున్న ఫైనల్​ మ్యాచ్​లో భారత యువ బ్యాటర్ వైభవ్​ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. 29 బంతుల్లో 94 పరుగులు చేశాడు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Vaibhav Suryavanshi | ముక్కోణపు సిరీస్​లో భాగంగా శ్రీలంక ఏ జట్టుతో జరుగుతున్న ఫైనల్​ మ్యాచ్​లో భారత యువ బ్యాటర్ వైభవ్​ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. శ్రీలంక బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడ్డాడు.

భారత్​–ఏ, శ్రీలంక–ఏ, అఫ్గానిస్థాన్​ –ఏ జట్ల మధ్య ట్రై సిరీస్​ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్​లో భారత్​ ఇప్పటికి మూడు మ్యాచ్​లు ఆడగా రెండింట్లో గెలిచి ఫైనల్​కు చేరింది. శ్రీలకం మూడు మ్యాచ్​ల్లో విజయం సాధించింది. అయితే శ్రీలంక, భారత్​ మధ్య జరిగిన గత మ్యాచ్లో ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మొదట టై అయిన ఆ మ్యాచ్​లో సూపర్​ ఓవర్​లో శ్రీలంక గెలుపొందింది. అయితే ఆ సమయంలో శ్రీలంక క్రికెటర్లు, భారత చిచ్చర పిడుగు వైభవ్​ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఫైనల్​లో వైభవ్​ రెచ్చిపోయి ఆడాడు.

Vaibhav Suryavanshi | జస్ట్​లో సెంచరీ మిస్​

Vaibhav Suryavanshi

ఫైనల్​ మ్యాచ్​లో టాస్​ గెలిచిన శ్రీలంక భారత్​ను బ్యాటింగ్​కు ఆహ్వానించింది. దీంతో ఓపెనర్లు ప్రియాన్స్​ ఆర్య, వైభవ్​ సూర్యవంశీ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఆర్య నెమ్మదిగా ఆడినా.. వైభవ్​ మాత్రం రెచ్చిపోయాడు. శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూయించాడు. 29 బంతుల్లో 94 పరుగులు చేశాడు. ఇందులో 10 ఫోర్లు, 8 సిక్స్​లు ఉన్నాయి. సెంచరీకి 6 పరుగుల దూరంలో వైభవ్​ ఔట్ అయ్యాడు. దీంతో భారత్​ 8.5 ఓవర్లలోనే 132 పరుగులు చేసింది.

ఇది కూడా చదవండి..: India vs Afghanistan ODI | అఫ్గానిస్థాన్​పై భారత్ ఘన విజయం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *