అక్షరటుడే, వెబ్‌డెస్క్: Advit Jewels IPO | అద్విత్ జ్యువెల్స్ (Advit Jewels)ను 2019లో స్థాపించారు. ఈ కంపెనీ ‘రాంభాజో’ బ్రాండ్ పేరుతో కుందన్, పోల్కి, వజ్రాలు మరియు స్టడెడ్ ఆభరణాలను తయారుచేసే ఒక ప్రముఖ సంస్థ. సంప్రదాయ పద్ధతులను ఆధునిక డిజైన్లతో మేళవించి ప్రత్యేకమైన ఆభరణాలను రూపొందిస్తుంది. దీని ఉత్పత్తి శ్రేణిలో వజ్రాలు, రంగురాళ్లతో పొదిగిన 14కే మరియు 18కే బంగారంతో చేసిన నెక్లెస్‌లు, చెవిపోగులు, ఉంగరాలు, గాజులు, కస్టమైజ్డ్ ఆభరణాలున్నాయి.
Advit Jewels IPO | జైపూర్‌లో తయారీ కేంద్రం..
ఈ కంపెనీ తయారీ కేంద్రం జైపూర్‌లో (6,450 చదరపు అడుగులు) ఉంది. ఇది లీజ్ ప్రాంగణంలో నడుస్తోంది. పూర్తిగా కంపెనీ నిర్వహణలో ఉంటుంది. ఈ సంస్థ డీలర్లు, షోరూమ్‌లు మరియు రిటైలర్లకు సరఫరా చేస్తూ బీ2బీ పద్ధతిలో తన వ్యాపారాన్ని నిర్వహిస్తుంది, అదే సమయంలో ప్రత్యేకమైన ఆభరణాల కోసం బీ2సీ వినియోగదారులకు సేవలు అందిస్తోంది. ఇది 3డీ ప్రింటర్లు, కాస్టింగ్ యూనిట్ల వంటి ఆధునిక యంత్రాలతో అమర్చబడింది.
Advit Jewels IPO | ఫ్రెష్ ఇష్యూ ద్వారా..
పూర్తిగా ఫ్రెష్ ఇష్యూ ద్వారా నిధులు సమీకరించనున్నారు. రూ. 10 ముఖ విలువ కలిగిన సుమారు 1.19 కోట్ల షేర్లను విక్రయించడం ద్వారా రూ. 165.16 కోట్లు సమీకరించనున్నారు. ఇందులో 65 కోట్ల రూపాయలు వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, మరో 65 కోట్ల రూపాయలను అప్పులు తిరిగి చెల్లించడానికి లేదా కొంత భాగం ముందే క్లోజ్ చేయడానికి ఉపయోగిస్తారు. మిగతా డబ్బు సాధారణ కంపెనీ అవసరాలకోసం వినియోగిస్తారు.
ధరల శ్రేణి : ప్రైస్ బ్యాండ్‌ను ఒక్కో ఈక్విటీ షేర్‌కు 130 రూపాయల నుంచి 138 రూపాయలుగా నిర్ణయించారు. లాట్ లో 100 షేర్లున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు ఒక లాట్ కోసం గరిష్ట ప్రైస్ బ్యాండ్ వద్ద రూ. 13,800తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గరిష్టంగా 14 లాట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
కోటా, జీఎంపీ : క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్‌కు గరిష్టంగా 50 శాతం వరకు షేర్లు కేటాయిస్తారు. నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు కనీసం 15 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు కనీసం 35 శాతం షేర్ల కేటాయింపు ఉంటుంది. ఈ కంపెనీ షేర్లకు గ్రే మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. గ్రే మార్కెట్ ప్రీమియం ప్రస్తుతం 55 రూపాయలు ఉంది. అంటే ఐపీవో అలాట్ అయితే 40 శాతం వరకు లాభాలు వచ్చే అవకాశాలున్నాయి.
ఐపీవో తేదీలు : పబ్లిక్ ఇష్యూ జూన్ 23న ప్రారంభమవుతుంది. జూన్ 25 వరకు అందుబాటులో ఉంటుంది. అలాట్మెంట్ స్టేటస్ 29న రాత్రి వెల్లడయ్యే అవకాశాలున్నాయి. కంపెనీ షేర్లు బీఎసఈ, ఎనఎసఈలో జూలై 1న లిస్ట్ అవుతాయి.
ఇది కూడా చదవండి..: Waterways Leisure Tourism IPO | ఐపీవోకు లగ్జరీ క్రూయిజ్ సర్వీసుల కంపెనీ.. 23 నుంచి సబ్స్క్రిప్షన్ ప్రారంభం