Bus Collision | ఆర్టీసీ బస్సు బైక్​ ఢీ.. ఒకరు మృతి

ఆర్టీసీ బస్సు, బైక్​ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా మరొక మహిళ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన పాల్వంచ మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Bus Collision | ఆర్టీసీ బస్సు(TGSRTC), బైక్​ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా మరొక మహిళ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన పాల్వంచ మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది.

Bus Collision | ఎదురెదురుగా..

స్థానికులు, పోలీసుల(kamareddy Police) కథనం ప్రకారం.. కరీంనగర్ నుంచి కామారెడ్డి(Kamareddy) వైపు ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు వస్తుండగా కామారెడ్డి నుంచి మాచారెడ్డి వైపు ఓ వ్యక్తి బైక్​పై మహిళను ఎక్కించుకుని వెళ్తున్నాడు. పాల్వంచ వాగు సమీపంలోకి రాగానే బస్సు, బైక్​ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో బైక్​ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా వెనక కూర్చున్న మహిళ తీవ్రంగా గాయపడ్డారు. అయితే సదరు మహిళ లిఫ్ట్ తీసుకుని వస్తున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. మృతుడు, గాయపడిన మహిళ వివరాలు లభించలేదని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం, గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం జీజీహెచ్​కు తరలించారు.

ఇది కూడా చదవండి: అమ్మోనియా గ్యాస్ లీక్​.. ఏడుగురు మహిళలు మృతి

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *