అక్షరటుడే,ఆర్మూర్: RTC Recruitment | ఆర్మూర్ ఆర్టీసీ డిపో (Armur RTC Depot)లో తాత్కాలిక పద్ధతిలో కండక్టర్లు, డ్రైవర్ల నియామకాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు గురువారం డిపో మేనేజర్ మల్లేష్ ప్రకటన విడుదల చేశారు..
RTC Recruitment | ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో..
ఆర్టీసీ సమ్మె (RTC Strike) నేపథ్యంలో రోజువారి పద్ధతిన సిబ్బందిని నియమిస్తామని డిపో మేనేజర్ తెలిపారు. డ్రైవర్ పోస్టుకు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండి 18 నెలల అనుభవం ఉండాలన్నారు. అలాగే కండక్టర్ పోస్టు (Conductor Post)కు పదో తరగతి అర్హత కలిగి ఉండాలన్నారు. ఈ రెండు పోస్టులకు రోజువారీగా రూ.వెయ్యి వేతనం చెల్లిస్తామని తెలిపారు. ఆసక్తి గలవారు నేరుగా ఆర్మూర్ డిపోలో సంప్రదించాలని.. ఒరిజినల్ ఎస్సెస్సీ మెమో, ఒరిజినల్ ఆధార్ కార్డు, రెండు ఫొటోలు, పాన్ కార్డు తీసుకుని డిపో మేనేజర్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు.
ఇది కూడా చదవండి..: Electric Shock | విద్యుదాఘాతంతో యువకుడు మృతి

