అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Congress Mandal Presidents | నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్(Armoor), బాల్కొండ (Balkonda), నిజామాబాద్ రూరల్, బోధన్ నియోజకవర్గాల మండలాలకు కాంగ్రెస్ అధ్యక్షులను అధిష్టానం నియమించింది. ఈ మేరకు డీసీసీ అధ్యక్షుడు నగేష్రెడ్డి సోమవారం ప్రకటన విడుదల చేశారు.
ఇప్పటి వరకు జిల్లాలో 25 మండల కాంగ్రెస్ అధ్యక్షులను, ముగ్గురు టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులను నియమించినట్లు నగేష్ రెడ్డి పేర్కొన్నారు. బోధన్ (Bodhan) ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి, బాల్కొండ ఇన్ఛార్జి సునీల్ రెడ్డి సూచనల మేరకు.. తన ప్రతిపాదనలతో పీసీసీ చీఫ్ ఈ నియామకాలను చేపట్టినట్లు నగేష్రెడ్డి తెలిపారు.
Congress Mandal Presidents | అధ్యక్షులు వీరే..
ఆర్మూర్ నియోజకవర్గంలో.. నాగరాజు రెడ్డి(ఆర్మూర్), దయాకర్ రావ్(మాక్లూర్), ప్రమోద్(ఆలూర్), దూడ వెంకటేష్(నందిపేట్), బాబు రావ్(డొంకేశ్వర్), సాయి బాబా గౌడ్ (ఆర్మూర్ టౌన్). నిబామాబాద్ రూరల్ నియోజకవర్గంలో మంగూరప్ రవి(మోపాల్), కిషన్ నేత(ఇందల్వాయి), మూత జనార్దన్(నిజామాబాద్ రూరల్), రాథోడ్ అంబర్ సింగ్(డిచ్పల్లి), గాదె నరేష్(ధర్పల్లి),గడ్డం సంజీవ్ అలియాస్ సురేష్ (జక్రాన్పల్లి), రొండ్ల గోవర్ధన్(సిరికొండ). బోధన్ నియోజకవర్గంలో రవి(సాలూర), నాగేశ్వర్ రావ్(బోధన్ మండల్), శ్రీనివాస్ గౌడ్(నవీపేట్), పులి శ్రీనివాస్(ఎడపల్లి), దామోదర్(బోధన్ టౌన్), మొబిన్(రెంజల్). బాల్కొండ నియోజకవర్గంలో.. సాట్ల ప్రవీణ్(బాల్కొండ), మల్లెల లక్ష్మణ్ (భీమ్గల్), బోనారి భాస్కర్(కమ్మర్పల్లి), శివ కుమార్(ఎర్గట్ల), బక్కూరి ఆనంద్(మోర్తాడ్), కొల్వి శ్రీకాంత్ రెడ్డి(ముప్కాల్), రంగు అనిల్(వేల్పూర్), బడాలా సాయిరెడ్డి(మెండోరా),పర్స అనంత్ రావ్(భీమ్గల్ టౌన్) నియమితులయ్యారు.

ఇది కూడా చదవండి : ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి