Farmer Seed Fairs | రైతు వేదికల్లో విత్తన మేళాలు.. ఇప్పటికే నార్లు పోసిన రైతులు

రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అధికారులు అన్నదాతల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. సాగు విషయంలో ప్రణాళిక లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Farmer Seed Fairs | రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అధికారులు అన్నదాతల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. ఆరుగాలం కష్ట పండించే విషయంలో అధికారులు ప్రణాళిక లేకుండా వ్యవహరిస్తున్నారు.

రాష్ట్రంలో వర్షాకాలంలో ఎక్కువ విస్తీర్ణంలో వరి సాగు చేస్తారు. బోనస్  (Paddy Bonus)​, దొడ్డు రకాలు కొనుగోలు చేయరేమోనని ఈ సారి రైతులు సన్నాలు సాగు చేయడానికి సిద్ధం అయ్యారు. ఇప్పటికే దాదాపు 50 శాతం మంది రైతులు నార్లు పోశారు. నార్లు పోసిన తర్వాత ప్రభుత్వం ఏడు రకాల సన్నాలకు మాత్రమే బోనస్​ ఇస్తామని ప్రకటించింది. తాజాగా వ్యవసాయ శాఖ మరో నిర్ణయం తీసుకుంది. రైతు వేదికల్లో విత్తన మేళాలు నిర్వహించనున్నట్లు తెలిపింది.

Farmer Seed Fairs | మొదలైన నాట్లు

paddy 1

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇప్పటికే వరినాట్లు ప్రారంభం అయ్యాయి. చాలా వరకు రైతులు నారు పోశారు. భారీ వర్షాలు పడితే నాట్లు వేయడానికి సిద్ధం అవుతున్నారు. ఈ సమయంలో ఎరువులు అందించాల్సిన వ్యవసాయ శాఖ.. విత్తన మేళాలు నిర్వహించడం విస్మయం కలిగిస్తోంది. అసలు సాగు సీజన్​, రైతుల అవసరాలపై ఎలాంటి ఆలోచన లేకుండా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తుండటం గమనార్హం.

Farmer Seed Fairs | జూన్​ 23 నుంచి..

రాష్ట్రవ్యాప్తంగా 2,601 రైతు వేదికల్లో జూన్ 23 నుండి 30 వరకు విత్తన మేళాలు నిర్వహించననున్నట్లు అధికారులు తెలిపారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎంపిక చేసిన ఏడు రకాల వరిసన్నరకాలు పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాల,కూరగాయ విత్తనాలు రైైతు వేదికల్లో అందుబాటులో ఉంచుతారు. ఎల్‌నినో (El Nino) పరిస్థితులకు అనుగుణంగా ఏ పంటలు సాగు చేయాలో వివరిస్తారు. అయితే ఇప్పటికే నారు పోసి, నాట్లు వేస్తున్న రైతులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెల రోజుల ముందు పెట్టాల్సిన అవగాహన సదస్సులు ఇప్పుడు పెడితే లాభం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

Farmer Seed Fairs | అందుబాటులో విత్తనాలు

విత్తన మేళాల్లో పెసర, మినుము, కంది వంటి పప్పుధాన్య పంటల విత్తనాలతో పాటు నువ్వులు, వేరుశెనగ వంటి నూనె గింజల పంటల విత్తనాలు, వివిధ రకాల చిరుధాన్యాలు, కూరగాయల విత్తనాలు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు, ఉద్యానవన శాఖ, శాస్త్రవేత్తలు రైతులకు విత్తనాల ఎంపిక, విత్తన శుద్ధి, సమగ్ర పంట యాజమాన్యం, ఎరువుల వినియోగం, నీటి యాజమాన్యం, చీడపీడల నివారణ తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నారు. అయితే వ్యవసాయ శాఖ తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దీనిని కూడా చదవండి : Urea Crisis | యూరియా కోసం రైతు ఆత్మహత్యాయత్నం..

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *