Basara Temple Theft | బాసర ఆలయంలో చోరీ

నిర్మల్​ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన సరస్వతి ఆలయంలో చోరీ జరిగింది. ఆలయ ప్రాంగణంలోని మహంకాళీ అమ్మవారి గుడిలో దొంగలు చోరీ చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Basara Temple Theft | నిర్మల్​ జిల్లా (Nirmal District)లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన సరస్వతి ఆలయంలో చోరీ జరిగింది. ఆలయ ప్రాంగణంలోని మహంకాళీ అమ్మవారి గుడిలో దొంగలు చోరీ చేశారు.

సరస్వతి అమ్మవారి ఆలయం పైఅంతస్తులో మహంకాళి అమ్మవారి గుడి ఉంది. సోమవారం అర్ధరాత్రి ఇద్దరు దొంగలు ఆలయంలోకి చొరబడ్డారు. మహంకాళి అమ్మవారి ఆలయ తలుపులు పగులకొట్టారు. అనంతరం అమ్మవారి వెండి కిరీటం, హుండీని ఎత్తుకెళ్లారు. హుండీలోని నగదు తీసుకొని, దానిని వ్యాసగుడి దగ్గర పడేసి పారిపోయారు.

Basara Temple Theft | కేసు నమోదు

ఆలయ అర్చకులు మంగళవారం ఉదయం రోజు మాదిరిగా పూజలు చేయడానికి వచ్చారు. అయితే మహంకాళి ఆలయం (Mahankali Temple) తలుపులు పగులకొట్టి ఉండటం, వెండి కిరీటం కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కాగా చోరీ దృశ్యాలు సీసీ టీవీలో రికార్డు అయ్యాయి. దాని ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.

Basara Temple Theft | భద్రత లోపం

Basara Temple Theft

చోరీకి గురైన వెండి కిరీటం సుమారు కిలోన్నర వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. క్లూస్‌ టీమ్‌, డాగ్‌ స్క్వాడ్​తో పోలీసులు ఆధారాలు సేకరించారు. చోరీ నేపథ్యంలో నేడు నిర్వహించాల్సిన హుండీ లెక్కింపును అధికారులు వాయిదా వేశారు. ఎస్పీ జానకి షర్మిల, ముథోల్‌ ఎమ్మెల్యే రామారావు ఆలయానికి చేరుకుని పరిశీలించారు. అయితే బాసర సరస్వతి ఆలయానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తారు. ప్రస్తుతం పాఠశాలలు పున : ప్రారంభం కావడంతో అక్షరాభ్యాసం చేయించడానికి తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి సైతం భక్తులు వస్తున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో చోరీ జరగడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భద్రత లోపంతోనే చోరీ జరిగిందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

ఇది కూడా చదవండి..: ACB Raids | ఎక్సైజ్​ శాఖలో కలకలం.. సూపరింటెండెంట్​ ఇంట్లో ఏసీబీ సోదాలు..

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *