అక్షరటుడే, వెబ్డెస్క్: Olympics 2036 | తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒలింపిక్ డే రన్-2026 కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా, యువజన సేవల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. నగరంలోని ఎల్‌బీ స్టేడియంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
మంత్రి వాకిటి శ్రీహరి (Minister Vakiti Srihari) మాట్లాడుతూ నగరం నలుమూలల నుంచి ఒలింపిక్ జ్యోతిని తీసుకువచ్చిన క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. ప్రతి ఒక్కరిలో ఒలింపిక్ స్ఫూర్తిని నింపే లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఒలింపిక్ డే రన్ నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఈ రన్ క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించడమే కాకుండా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి దోహదపడుతుందని మంత్రి అన్నారు. క్రమశిక్షణతో కూడిన క్రీడాకారులే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించగలరని, మిలిటరీ సైనికులకు ఉన్నంత క్రమశిక్షణ క్రీడాకారులకు కూడా ఉండాలని సూచించారు.
Olympics 2036 | క్రీడలకు ప్రాధాన్యం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నాయకత్వంలోని ప్రభుత్వం రెండున్నర సంవత్సరాల్లో క్రీడలకు ప్రాధాన్యతనిస్తూ పలు కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసిందని మంత్రి తెలిపారు. 2036 ఒలింపిక్స్‌లో తెలంగాణ క్రీడాకారులు పతకాలు సాధించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు సీఎం కప్ నిర్వహించినట్లు గుర్తు చేశారు.
ఇది కూడా చదవండి..: Parawada Pharma City Fire | పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం.. ఇద్దరి మృతి