అక్షరటుడే వెబ్‌డెస్క్: Hyderabad harassment case | తమపై ఉన్నతాధికారుల వేధింపులు సహించలేక, చివరికి ప్రజాభవన్‌ను ఆశ్రయించిన ఘటన మేడ్చల్ ( పరిధిలో వెలుగుచూసింది. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ( cyberabad municipal corporation ), జీడిమెట్ల సర్కిల్‌లో శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ (SFA)గా పనిచేస్తున్న మహిళా ఉద్యోగిని తన ఆవేదనను అధికారుల ముందు వెల్లడించారు. గత 25 ఏళ్లుగా నిబద్ధతతో పనిచేస్తున్న తనను, సదరు సర్కిల్ డిప్యూటీ కమిషనర్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మానసిక వేధింపులకు గురిచేస్తున్నారని ఆమె ఫిర్యాదు చేశారు.
Hyderabad harassment case | అవమానకరంగా ప్రవర్తిస్తూ..
సర్కిల్ డిప్యూటీ కమిషనర్ తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారని బాధితురాలు ఆరోపించారు. అందరి ముందు, సహోద్యోగుల సమక్షంలో తనను అత్యంత అసభ్యకరమైన పదజాలంతో దూషించడమే కాకుండా, పనిని కించపరిచేలా మాట్లాడుతున్నారని వాపోయారు. “నువ్వు జాడు కొట్టు” అంటూ పరుషంగా మాట్లాడటమే కాకుండా, బెదిరింపు ధోరణిని అవలంబిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పనితీరుకు ప్రశంసలు అందుకున్న తను, ప్రస్తుతం ఈ అధికారి ప్రవర్తన వల్ల విధులకు వెళ్లలేక తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నానని తెలిపారు.
Hyderabad harassment case | ఆర్థిక ఇబ్బందులతో సతమతం..
ఒంటరి మహిళనైన తనకు ఇద్దరు పిల్లల బాధ్యత ఉందని, అకారణంగా తన లాగిన్‌ను నిలిపివేయడంతో జీతం రాక కుటుంబం రోడ్డున పడిందని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. సమస్య పరిష్కారం కోసం ఇప్పటికే జోనల్ కమిషనర్, కార్పొరేషన్ కమిషనర్ , రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. చివరి ప్రయత్నంగా హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో మొర పెట్టుకున్నట్లు ఆమె చెప్పారు. తన లాగిన్‌ను వెంటనే పునరుద్ధరించి, తనకు రక్షణ కల్పించాలని ఉన్నతాధికారులను ఆమె కోరుతున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి: Udhayanidhi Stalin Remarks | అసెంబ్లీని సినిమా హాల్లా మార్చిన సీఎం విజయ్ : ఉదయనిధి స్టాలిన్