Heavy Rain Alert | నేడు భారీ వర్ష సూచన

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధవారం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heavy Rain Alert | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధవారం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) అధికారులు తెలిపారు. ఉత్తర, పశ్చిమ తెలంగాణల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.

తెలంగాణ వ్యాప్తంగా నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాతావరణం కాస్తా చల్లబడింది. బుధవారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంది. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు పలు జిల్లాల్లో భారీ వర్షం పడుతుందని అధికారులు తెలిపారు.

Heavy Rain Alert | ఈ జిల్లాలకు అలెర్ట్​

ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మంచిర్యాల, సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడా తీవ్రమైన ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలో సాయంత్రం లేదా రాత్రి వేళల్లో మోస్తరు వర్షం కురిసే ఛాన్స్​ ఉంది.

దీనిని కూడా చదవండి : ACB Trap | స్టేషన్​ బెయిల్ కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన ఎస్సై

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *