Balka Suman Bail | బీఆర్‌ఎస్‌ నేత బాల్క సుమన్‌కు బెయిల్ మంజూరు

బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు తెలంగాణ హైకోర్టు ఊరట కల్పించింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Balka Suman Bail | బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు తెలంగాణ హైకోర్టు ఊరట కల్పించింది. ఇటీవలి కాలంలో ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి నమోదైన కేసులో, హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Balka Suman Bail | కేసు నేపథ్యం..

నగరంలోని నాంపల్లిలో ఉన్న సింగరేణి భవన్, అలాగే మందమర్రిలోని సింగరేణి జీఎం కార్యాలయ అధికారులను ఉద్దేశించి బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ సింగరేణి అధికారులు నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.

ఈ కేసులో తాజాగా హైకోర్టును ఆశ్రయించిన బాల్క సుమన్‌కు బెయిల్ లభించడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఏర్పడింది. ఈ కేసు దర్యాప్తు నేపథ్యంలో సుమన్ అరెస్టు అంశం గత కొద్ది రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
balka.1

 

ఇది కూడా చదవండి:  Khamenei Funeral | ఖమేనీ అంత్యక్రియలు.. ప్రధాని మోదీకి ఇరాన్ ఆహ్వానం

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *