అక్షరటుడే, తెయూ క్యాంపస్: TU Exams | తెలంగాణ యూనివర్సిటీలో (Telangana University) వివిధ విభాగాలకు సంబంధించి పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు కంట్రోలర్ సంపత్ కుమార్ బుధవారం ప్రకటనలో తెలిపారు.
TU Exams | 29 నుంచి బీఈడీ, బీపీఈడీ నాల్గో సెమిస్టర్ పరీక్షలు
యూనివర్సిటీ పరిధిలో బీఈడీ, బీపీఈడీ(BPED Exams) నాలుగో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు ఈనెల 29 నుంచి ప్రారంభం కానున్నాయి. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటీ వెబ్ సైట్‌ను సందర్శించాలన్నారు.
4 నుంచి వన్‌టైం ఛాన్స్ డిగ్రీ బ్యాక్‌లాగ్ పరీక్షలు
యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో 2016 నుంచి 2020 బ్యాచ్‌ల విద్యార్థులకు వన్ టైం ఛాన్స్ బ్యాక్‌లాగ్ (Degree Backlog Exams) పరీక్షలు వచ్చేనెల 4 నుంచి జరుగనున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలంగాణ యూనివర్సిటీ వెబ్ సైట్లో పొందుపర్చారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆయా తేదీలకనుగుణంగా పరీక్షలకు హాజరు కావాలని సూచించారు.

ఇది కూడా చదవండి: మర్రిపల్లి చెరువు కబ్జాల తొలగింపు