బిజినెస్​Stock Market | రెండో రోజూ నష్టాలే..

Stock Market | రెండో రోజూ నష్టాలే..

దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా రెండో సెషన్‌లోనూ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 852 పాయింట్లు, నిఫ్టీ 205 పాయింట్లు కోల్పోయాయి.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market | పశ్చిమాసియాలో నెలకొన్న జియో పొలిటికల్ టెన్షన్స్ స్టాక్ మార్కెట్‌కు ప్రతికూలంగా మారాయి. హార్మూజ్ జలసంధిపై దిగ్బంధనం కొనసాగుతుండడంతో క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

ఎఫ్ ఐఐల పెట్టుబడుల ఉపసంహరణ, రూపాయిలో బలహీనతతోపాటు పెరిగిన ఇంధన ధరల ప్రభావాన్ని కారణంగా చూపుతూ హెచ్ ఎస్ బీసీ భారతీయ ఈక్విటీల రేటింగ్‌ను న్యూట్రల్ నుంచి అండర్ వెయిట్ కు తగ్గించడమూ మార్కెట్ల పతనానికి కారణాలుగా భావిస్తున్నారు.

Stock Market | రోజంతా నష్టాల్లోనే.

దేశీయ స్టాక్ మార్కెట్‌ (Domestic Stock Market)లో బెంచ్ మార్క్ సూచీలైన నిఫ్టీ (Nifty), సెన్సెక్స్ రోజంతా నష్టాల్లోనే కొనసాగాయి. గురువారం ఉదయం సెన్సెక్స్ 533 పాయింట్ల గ్యాప్ డౌన్ తో ప్రారంభమై.. అక్కడినుంచి 195 పాయింట్లు పెరిగింది. అమ్మకాల ఒత్తిడితో ఇంట్రాడే గరిష్టాలనుంచి 604 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 176 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 108 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి మరో 176 పాయింట్లు నష్టపోయింది. చివరికి సెన్సెక్స్ 852 పాయింట్ల నష్టంతో 77,664 వద్ద, నిఫ్టీ 205 పాయింట్ల నష్టంతో 24,173 వద్ద స్థిరపడ్డాయి.

Stock Market | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 1,762 కంపెనీలు లాభపడగా 2,517 స్టాక్స్ నష్టపోయాయి. 170 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 142 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 29 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. బీఎస్ ఈలో నమోదైన కంపెనీల సంపద విలువ రూ. 2.73 లక్షల కోట్లు తగ్గింది.

Stock Market | మిక్స్‌డ్ గా సూచీలు..

దేశీయ స్టాక్ మార్కెట్‌లోని ఇండెక్స్‌లు మిక్స్‌డ్‌గా ముగిశాయి. ఫార్మా 2.36 శాతం, మీడియా 0.90 శాతం, పవర్, క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్‌లు 0.40 శాతం లాభపడ్డాయి.
ఆటో ఇండెక్స్ 2.35 శాతం, రియాలిటీ ఇండెక్స్ 1.83 శాతం, బ్యాంక్ నిఫ్టీ 1.43 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.32 శాతం, ఐటీ ఇండెక్స్ 1.22 శాతం నష్టపోయాయి.

Gainers: బీఎస్ఈ సెన్సెక్స్‌లో 5 స్టాక్స్ లాభపడగా.. 25 స్టాక్స్ నష్టాలతో ముగిశాయి. అదానీపోర్ట్స్ 0.97 శాతం, ఎల్‌టీ 0.82 శాతం, సన్‌ఫార్మా 0.64 శాతం, ఎయిర్‌టెల్ 0.60 శాతం, బీఈఎల్ 0.27 శాతం లాభపడ్డాయి.
Top losers: ట్రెంట్ 4.21 శాతం, ఎంఅండ్ఎం 3.30 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 2.93 శాతం, టెక్ మహీంద్రా 2.90 శాతం, ఇన్ఫోసిస్ 2.04 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: Tecno POP X | ఐఫోన్ లుక్‌తో.. బడ్జెట్ ఫోన్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Bellamkonda Wedding | రుమలలో ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వివాహం.. కావ్య రెడ్డితో కొత్త జీవితానికి శ్రీకారం

అక్షరటుడే, వెబ్​డెస్క్: Bellamkonda Wedding | తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక...

April 30 Gold Rates | మ‌రింత త‌గ్గుతున్న బంగారం ధ‌ర‌.. కొనుగోలుదారులకు ఊరట!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 30 Gold Rates | అంతర్జాతీయ మార్కెట్‌లో...

April 30 Horoscope | సమాజంలో పెరగనున్న కీర్తి ప్రతిష్ఠలు.. ఈ రాశుల వారి వ్యక్తిత్వానికి ఫిదా అవ్వాల్సిందే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 30 Horoscope | ఇవాళ గ్రహ గతులను బట్టి...

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...