అక్షరటుడే, వెబ్డెస్క్ : Bhadrachalam Temple | భద్రాచలం ఆలయ అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ నెల 27న సీతారామచంద్రస్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టునుంది. ఈ మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) వివరాలు వెల్లడించారు.
భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఆగమశాస్త్ర నియమాలను పాటిస్తూ ఆలయ అభివృద్ధి పనులు చేపడుతామని తెలిపారు. రెండు వందల సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆలయాన్ని అభివృద్ధి చేయాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు నిర్మాణ పనులు చేపడుతామని తెలిపారు. ఆలయ పునరుద్ధరణ పనులకు ముఖ్యమంత్రి రూ.351 కోట్లు ఇప్పటికే మంజూరు చేశారని వెల్లడించారు.
Bhadrachalam Temple | అధికారులతో సమీక్ష

సీతారామచంద్ర స్వామి దేవస్థానం అభివృద్ధి పనుల ప్రారంభం నేపథ్యంలో సచివాలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు, భద్రాచలం ఆలయ అధికారులతో మంత్రి సమీక్షా నిర్వహించారు. ఆలయ వైభవం, ఆధ్యాత్మికతకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, సంప్రదాయ శిల్పకళను ప్రతిబింబించేలా రాతి నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వచ్చే శ్రీరామ నవమి నాటికి నిర్దేశించిన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు.
దీనిని కూడా చదవండి : ACB DA Case | ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు.. భారీగా అక్రమాస్తుల గుర్తింపు