అక్షరటుడే, కమ్మర్పల్లి: Indiramma Houses | కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఎల్లప్పుడూ పేదల పక్షమేనని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి అన్నారు. మండలంలోని కోన సముందర్, నర్సాపూర్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా మానాల మోహన్ రెడ్డిని నర్సాపూర్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ లతా శేఖర్, ఉపసర్పంచ్ రాజకుమార్, పాలకవర్గం ఘనంగా సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు.
Indiramma Houses | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నాం..
ఈ సందర్భంగా మానాల మాట్లాడుతూ.. పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామన్నారు. ఎన్నికల హామీలో భాగంగా ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు ఇస్తామని సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నారన్నారు. రాష్ట్రంలోని 119 నియోజవర్గాల్లో 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయన్నారు. లబ్ధిదారులు ఇళ్లను నిర్మించుకుంటున్నారని వివరించారు. అలాగే బాల్కొండ నియోజకవర్గంలో కూడా 3,500 ఇళ్లు నిర్మాణాలు పూర్తిచేసుకోవడం సంతోషం కలిగిస్తుందన్నారు. ఇళ్ల నిర్మాణాలకు సహకరిస్తున్న రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy), పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ పాలెపు నర్సన్న, మండల ప్రెసిడెంట్ సుంకెట రవి, గణేష్, సంజీవ్, లింబాద్రి, రమేష్ గౌడ్ తదతరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Paddy Procurement | ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి..కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

