Venezuela Earthquake Miracle | మృత్యుంజయురాలు.. వెనెజువెలా శిథిలాలలో బయటపడ్డ 18 రోజుల పసికందు

వెనెజువెలాలో బుధవారం సాయంత్రం సంభవించిన జంట భూకంపాలు భారీ విధ్వంసాన్ని సృష్టించాయి.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Venezuela Earthquake Miracle | వెనెజువెలాలో బుధవారం సాయంత్రం సంభవించిన జంట భూకంపాలు భారీ విధ్వంసాన్ని సృష్టించాయి. వందలాది భవనాలు నేలమట్టం కావడంతో వేలాదిమంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈ విపత్తులో ఓ 18 రోజుల పసికందు తన తల్లితో కలిసి శిథిలాల కింద చిక్కుకుంది.

Venezuela Earthquake Miracle | తండ్రి వేదన..

తన భార్య, పసిబిడ్డ శిథిలాల కింద ఉండటంతో ఆ కన్నతండ్రి పడిన వేదన వర్ణనాతీతం. రెస్క్యూ సిబ్బంది సహాయంతో శిథిలాలను తొలగిస్తుంటే, ఆ తండ్రి ప్రాణం గొంతులోనే బిగుసుకుపోయింది. గంటల తరబడి శ్రమించిన తర్వాత, ఎట్టకేలకు ఆ 18 రోజుల బిడ్డ ప్రాణాలతో కనిపించింది. ఎలాంటి గాయాలు లేకుండా, ఆరోగ్యంగా ఉన్న బిడ్డను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ చిన్నారిని తండ్రికి అందించినప్పుడు అక్కడ ఉన్నవారంతా భావోద్వేగానికి లోనయ్యారు.

Venezuela Earthquake Miracle | మరో అద్భుతం..

బిడ్డ దొరికిన 90 నిమిషాల తర్వాత, శిథిలాల కింద చిక్కుకున్న తల్లిని కూడా రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా బయటకు తీశారు. భార్యాబిడ్డలిద్దరూ సజీవంగా బయటపడటంతో ఆ తండ్రి ఆనందానికి అవధులు లేవు. ఈ ఘటన వెనెజువెలా విపత్తులో ఒక అద్భుతంగా నిలిచింది.

Venezuela Earthquake Miracle | భారీ నష్టం..

ఈ జంట భూకంపాల వల్ల సుమారు రూ. 63 వేల కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా. ఒకవైపు ప్రాణనష్టం, మరోవైపు భారీ ఆస్తి నష్టంతో వెనెజువెలా అతలాకుతలమవుతోంది. అయితే, ఇటువంటి అద్భుతాలు మాత్రం విపత్తులో చిక్కుకున్న ప్రజలకు కొండంత ధైర్యాన్ని ఇస్తున్నాయి. ఈ కుటుంబం క్షేమంగా బయటపడిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: Student Welfare Facilities | విద్యార్థులకు సౌకర్యాలు అందేలా పర్యవేక్షించాలి: ప్రత్యేక అధికారిణి విజయేంద్ర

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *