Nursing Graduation Day | విద్యార్థులు తమ విద్యను సమాజ సేవకు వినియోగించుకోవాలి

విద్యార్థులు తమ విద్యను సమాజ సేవకు వినియోగించుకోవాలని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, బాన్సువాడ : Nursing Graduation Day | విద్యార్థులు తమ విద్యను సమాజ సేవకు వినియోగించుకోవాలని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. బాన్సువాడ పట్టణ కేంద్రంలోని భారత్ గార్డెన్స్‌లో బీఎస్సీ నర్సింగ్ కళాశాల విద్యార్థినుల తొలి గ్రాడ్యుయేషన్ డే, వీడ్కోలు వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు.

Nursing Graduation Day | వైద్యరంగంలో సేవాభావంతో ఉండాలి..

పోచారం (MLA Pocharam) మాట్లాడుతూ.. వైద్యరంగంలో సేవాభావంతో ఉండాలన్నారు. అయితేనే వారికి సమాజంలో గుర్తింపు వస్తుందన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మన్ కాసుల బాలరాజుతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఎస్సీ నర్సింగ్ కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులకు డిగ్రీ పట్టాలను అందజేసి అభినందించారు. కార్యక్రమంలో నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రణతి తదితరులు పాల్గొన్నారు.

Nursing Graduation Day

ఇది కూడా చదవండి..: Kalki Cheruvu Repairs | బుంగ మరమ్మతుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలి: ఎమ్మెల్యే పోచారం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *