అక్షరటుడే, వెబ్‌డెస్క్ : TG RERA | తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ నియంత్రణ అథారిటీ (టీజీ-రెరా) ఛైర్మన్‌గా శ్రీనివాసరాజు నియామకం అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జయేశ్ రంజన్ (Jayesh Ranjan) ఉత్తర్వులు జారీ చేశారు.
రియల్ ఎస్టేట్ (నియంత్రణ, అభివృద్ధి) చట్టం– 2016లోని సెక్షన్ 22, తెలంగాణ రియల్ ఎస్టేట్ (నియంత్రణ అభివృద్ధి) నియమావళి 2017లోని నియమం 17 ద్వారా సంక్రమించిన అధికారాలను ఉపయోగించి ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె.ఎస్. శ్రీనివాస రాజును రెరా ఛైర్మన్‌గా నియమించింది.
TG RERA | మెట్రో అడిషనల్ ఎండీగా అజిత్‌రెడ్డి

హైదరాబాద్ మెట్రో రైలు (Metro Rail) లిమిటెడ్ అదనపు మేనేజింగ్ డైరెక్టర్‌గా బి. అజిత్ రెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్వెస్ట్ తెలంగాణ, ఐ&సీ డిపార్ట్మెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా కొనసాగుతున్న అజిత్ రెడ్డిని హైదరాబాద్ మెట్రో అదనపు ఎండీ(ఎఫ్ఏసీ)గా నియమించారు.
Sri K.S. Sreenivasa Raju Appointed as Chairperson of Telangana RERA pic.twitter.com/f4E64pcu4h
— Jacob Ross (@JacobBhoompag) June 27, 2026
దీనిని కూడా చదవండి : Panchayat Secretary Bribery | ఇంటి అనుమతి కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి