అక్షరటుడే, వెబ్డెస్క్: Hyderabad House Explosion | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని సరూర్నగర్లో ఓ ఇంట్లో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇల్లు పూర్తిగ ధ్వంసం అయింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
Hyderabad House Explosion | తప్పిన ప్రమాదం
బాబూనగర్‌లో రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి దేవేందర్ ఇంట్లో మంగళవారం ఉదయం భారీ పేలుడు సంభవించినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాద సమయంలో కుటుంబ సభ్యులంతా ఇంట్లోనే ఉన్నప్పటికీ, అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఇంట్లోని మూడు గ్యాస్ సిలిండర్లు పేలకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో ఇల్లు ధ్వంసం అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి..: Kukatpally Degree College | ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అక్రమ ఫీజుల వసూళ్లపై ఏబీవీపీ ఆందోళన