Nitin Nabin Criticisms | తెలంగాణను కాంగ్రెస్ ఏటీఎంలా వాడుకుంటోంది: నితిన్ నబీన్

తెలంగాణను కాంగ్రెస్ పార్టీ తన 'దిల్లీ దర్బార్'కు ఏటీఎంలా మార్చుకుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తీవ్రస్థాయిలో విమర్శించారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Nitin Nabin Criticisms | తెలంగాణను కాంగ్రెస్ పార్టీ తన ‘దిల్లీ దర్బార్’కు ఏటీఎంలా మార్చుకుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ( Nitin Nabin ) తీవ్రస్థాయిలో విమర్శించారు. మల్కాజిగిరిలోని ఔషాపూర్‌లో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహా పలువురు ముఖ్య నాయకులు హాజరయ్యారు.

Nitin Nabin Criticisms | ప్రసంగంలోని అంశాలు..

రాష్ట్రంలో ‘ఆర్‌ఆర్‌ టాక్స్’ వసూలు చేస్తూ, ఆ సొమ్మును దిల్లీకి తరలిస్తున్నారని, తెలంగాణను కాంగ్రెస్ అధిష్టానానికి ఏటీఎంలా మార్చేశారని నితిన్ నబీన్ ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్కటీ అమలు చేయలేదని, అవినీతి, నేరాలతో కూడిన పాలనను సాగిస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్‌ఎస్‌ పార్టీలు ఒకే బాటలో పయనిస్తున్నాయని, బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు.

Nitin Nabin Criticisms | కార్యకర్తలకు పిలుపు..

ప్రధాని మోదీ నాయకత్వంలోని పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. పశ్చిమబెంగాల్‌ విజయం కార్యకర్తల కష్టంతోనే సాధ్యమైందని, అదే స్ఫూర్తితో తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని కోరారు. తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, మోదీ నాయకత్వంలో ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని నితిన్ నబీన్ ధీమా వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: KTR Rythu Bharosa | రూ.30 వేల కోట్ల రైతుభరోసా ఎగ్గొట్టిన ప్రభుత్వం : కేటీఆర్​

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *