అక్షరటుడే, వెబ్‌డెస్క్: Raghunandan Rao | మెదక్ ఎంపీ రఘునందన్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు యువ నాయకుడని, కాంగ్రెస్ అధ్యక్షుడు కూర్చుంటే లేవలేరన్నారు.బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ తెలంగాణలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో రఘునందన్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలోకి రావడమే తమ లక్ష్యమన్నారు. తమ అధ్యక్షుడు యువ నాయకుడని పేర్కొన్నారు. పార్టీ బలోపేతం లక్ష్యంగా ఆయన తెలంగాణలో పర్యటిస్తున్నారని చెప్పారు. కాగా మూడు రోజుల పర్యటన నిమిత్తం నితిన్ నబిన్ తెలంగాణకు వచ్చిన విషయం తెలిసిందే. ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
Raghunandan Rao | మంత్రి పొన్నంకు కౌంటర్

మంత్రి పొన్నం (Minister Ponnam) వ్యాఖ్యలకు ఎంపీ రఘునందన్‌రావు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణకు కేంద్రం సరిపడా యూరియా సరఫరా చేయడం లేదని పొన్నం ప్రభాకర్ అన్నారు. బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు. ఈ వ్యాఖ్యలకు రఘునందన్‌రావు స్పందించారు. తెలంగాణకు కేంద్రం సరిపడా యూరియా పంపిస్తోందని తెలిపారు. రైతులకు యూరియా పంపిణీ చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఢిల్లీలో ధర్నా చేసిన వ్యక్తి ఎక్కడున్నారో తెలుసని, రేపు కాంగ్రెస్ ఎక్కడుంటుందో చూడాలని ఎద్దేవా చేశారు. పంపిన యూరియా పంచడం చేతకాని వారు సైతం తమ పార్టీ అధ్యక్షుడి గురించి మాట్లాడుతున్నారన్నారు.
ఇది కూడా చదవండి..: Nitin Nabin Criticisms | తెలంగాణను కాంగ్రెస్ ఏటీఎంలా వాడుకుంటోంది: నితిన్ నబీన్