Siddapur Reservoir | సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులు వేగవంతం చేయాలి

వర్ని మండలం సిద్ధాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, బాన్సువాడ: Siddapur Reservoir | వర్ని మండలం సిద్ధాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి (MLA Pocharam Srinivas Reddy) అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఇరిగేషన్ శాఖ ఈఎన్‌సీ (జనరల్) రమేష్, ఈఎన్‌సీ (అడ్మిన్) శ్రీనివాస్‌తో కలిసి హైదరాబాద్​లోని తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.

Siddapur Reservoir | ముంపు ప్రభావిత భూములకు నష్టపరిహారం..

సిద్ధాపూర్ రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా ముంపు ప్రభావిత భూములకు నష్టపరిహారం చెల్లించి అవసరమైన అనుమతులు పొందేందుకు మే నెలలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో రూ.55.30 కోట్లను మంజూరు చేసిందని పోచారం తెలిపారు. ఇందుకు సంబంధించిన జీవో నెం.37ను ఈనెల 8న ప్రభుత్వం జారీ చేసిందన్నారు. ప్రాజెక్టు పనులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగేందుకు భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, నష్టపరిహారం చెల్లింపులు పారదర్శకంగా, సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అలాగే పనుల ప్రతి దశను క్షుణ్ణంగా పర్యవేక్షిస్తూ నిర్ణీత గడువులోగా నిర్మాణాన్ని పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో ఇరిగేషన్ శాఖ అధికారులు, సంబంధిత ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.

Siddapur Reservoir

ఇది కూడా చదవండి..: Kamareddy Moram Mining | పట్టపగలే దర్జాగా మొరం తవ్వకాలు.. పట్టించుకోని రెవెన్యూ, మైనింగ్ శాఖ అధికారులు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *