Ponnam Prabhakar Visit | గడుగు గంగాధర్​ను పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్​..

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం జిల్లాకు విచ్చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Ponnam Prabhakar Visit | రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam) బుధవారం జిల్లాకు విచ్చేశారు. ఇటీవల వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్(Gadugu Gangadhar) ఇల్లు షార్ట్ సర్క్యూట్​కు దగ్ధం కాగా మంత్రి గడుగు ఇంటికి వెళ్లారు.

Ponnam Prabhakar Visit | ఘటనపై వాకబు..

ఈ సందర్భంగా ఇల్లు దగ్ధం కావడానికి కారణాలను పొన్నం ప్రభాకర్​ తెలుసుకున్నారు. ఇంట్లోని పైఅంతస్తు పూర్తిగా కాలిపోవడాన్ని పరిశీలించారు. ధైర్యంగా ఉండాలని గడుగుకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, నుడా ఛైర్మన్ కేశవేణు, కల్లుగీత కార్పొరేషన్​ ఛైర్మన్​ శేఖర్​ గౌడ్​, సీనియర్ కాంగ్రెస్ నాయకులు( Congress Leaders)  జావిద్​ అక్రమ్​, బంటు బలరాం, విపుల్ ​గౌడ్,​ మాజీ కార్పొరేటర్​ గడుగు రోహిత్ తదితరులు​ పాల్గొన్నారు.

gadugu1

ఇది కూడా చదవండి : ఇండిగో బంపర్ ఆఫర్.. తక్కువ ధరకే విమాన ప్రయాణం..! 

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *