అక్షరటుడే వెబ్‌డెస్క్: Bandi Bhageerath Bail | పోక్సో కేసులో రిమాండ్ ఖైదీగా చర్లపల్లి జైలులో ఉన్న బండి భగీరథ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ( Telangana High Court )బుధవారం విచారణ చేపట్టింది. తనపై నమోదైన కేసులో ఎటువంటి నిజం లేదని, ఇది పూర్తిగా రాజకీయ కారణాలతో సృష్టించిన వ్యవహారమని భగీరథ్ తన పిటిషన్లో పేర్కొన్నారు. తాను విచారణకు పూర్తిగా సహకరిస్తున్నానని, కావున తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు.
Bandi Bhageerath Bail | కోర్టు ఆదేశాలు..
పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు, ఈ కేసులో బాధితురాలి వాదనను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఈ మేరకు బాధితురాలికి నోటీసులు జారీ చేస్తూ, కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను హైకోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది.

Bandi Bhageerath Bail | కేసు నేపథ్యం..
మైనర్ బాలికను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు రావడంతో, మే 8న పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదైంది. మే 16న పోలీసులు అతడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఆ తర్వాత ఇంజనీరింగ్ పరీక్షలు రాసేందుకు వీలుగా మేడ్చల్-మల్కాజిగిరి కోర్టు అతడికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. పరీక్షలు ముగియడంతో, బెయిల్ గడువు పూర్తయిన నేపథ్యంలో గత గురువారం అధికారులు అతడిని తిరిగి చర్లపల్లి జైలుకు తరలించారు. ప్రస్తుతం హైకోర్టులో రెగ్యులర్ బెయిల్ కోసం విచారణ జరుగుతుండటంతో, ఎల్లుండి న్యాయస్థానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
ఇది కూడా చదవండి: Mahesh Kumar Goud | బీజేపీతో పాటు ఎన్ని పార్టీలు కలిసినా కాంగ్రెస్‌ను ఢీకొట్టలేవు: మహేశ్ కుమార్ గౌడ్