అక్షరటుడే, వెబ్‌డెస్క్ : TRS Chief Kavitha Arrest | తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha)ను పోలీసులు అరెస్ట్ చేశారు. బోడుప్పల్ భూ పోరాట ప్రాంతానికి చేరుకొని నిరసన చేపట్టిన ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో బోడుప్పల్‌లోని భగయత్ నగర్లో భూపోరాటం సాగుతోంది. ఈ ప్రాంతంలోని ప్రభుత్వ స్థలాన్ని ఉద్యమ కారులకు ఇవ్వాలని కవిత డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం ఉదయం పోలీసులు టెంట్లు తొలగించారు. దీంతో కవిత అక్కడకు చేరుకున్నారు. తెలంగాణ ఉద్యమ కారుల రక్షణ కాలనీగా ఆ ప్రాంతానికి నామకరణం చేశారు. బొడ్రాయి ప్రతిష్టించి పూజలు చేశారు. అనంతరం ఆ స్థలంలో ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆందోళన చేపట్టారు. ఉద్యమకారులతో కలిసి చేపట్టిన ఈ ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. తోపులాటలో ఆమె కింద పడటంతో స్వల్ప గాయాలు అయ్యాయి. అనంతరం ఆమెను బలవంతంగా పోలీసులు కారులో ఎక్కించారు. తన రక్తాన్ని చూసిన ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని కవిత అన్నారు.

TRS Chief Kavitha Arrest | ప్రశ్నించే గొంతు నొక్కుతున్నారు
ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేసే చేతకాక ప్రశ్నించే గొంతులను నొక్కాలని చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి పతనం తప్పదని కవిత అన్నారు. ఉద్యమకారులకు న్యాయం చేస్తామని చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి వారి సమస్యలు ఇప్పుడు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇచ్చే వరకు మిమ్మల్ని వదిలిపెట్టం అన్నారు. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ మోసాలను ఎండగడుతామని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి..: Harish Rao Arrest | హరీశ్‌రావును అడ్డుకున్న పోలీసులు.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత