అక్షరటుడే, ఆర్మూర్ : MP Arvind | గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆధునిక శాస్త్రీయ పరిజ్ఞానాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని ఎంపీ ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind) పేర్కొన్నారు. గురువారం ఆలూరు (Alur) మండలం దేగాం గ్రామంలోని జడ్పీహెచ్ఎస్లో ఆధునిక సైన్స్ ల్యాబ్‌ను (Science Lab) ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.
MP Arvind | విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని..
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ఏడబ్ల్యూబీ (60:40) పథకం కింద 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.13.50 లక్షల వ్యయంతో ఈ సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేసినట్లు ఎంపీ తెలిపారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడంలో ఇలాంటి ల్యాబ్‌లు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పించడం ద్వారా గ్రామీణ విద్యార్థులకు కూడా పోటీ ప్రపంచంలో రాణించే అవకాశాలు మెరుగుపడతాయని చెప్పారు. విద్యార్థులు సైన్స్ ల్యాబ్‌ను (Science Education) సద్వినియోగం చేసుకుని విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.

ఇది కూడా చదవండి : కాంగ్రెస్, బీఆర్ఎస్లది ‘బిగ్ బాస్’ డ్రామా: బండి సంజయ్