అక్షరటుడే, గాంధారి: Gandhari Land Encroachment | ఖాళీ స్థలం కనిపిస్తే చాలు భూములను కబ్జా చేస్తున్నారు అక్రమార్కులు.. కొద్దికొద్దిగా భూములను ఆక్రమిస్తూ.. తమ గుప్పిట్లోకి తీసుకుంటున్నారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని జువ్వాడి శివారులో తమ భూములను కబ్జా చేశారని బీడీ వర్కర్లు, చిరు ఉద్యోగులు వాపోతున్నారు.
Gandhari Land Encroachment | కబ్జాకు గురవుతున్న వెంచర్ ప్లాట్లు..
జువ్వాడి శివారు కామారెడ్డి రోడ్డుకు సమీపంలో 2010లో కాట్మండి సంజీవరావు తోపాటు మరో ముగ్గురు కలిసి వెంచర్ చేశారు. 2010 నుంచి ఇప్పటివరకు ఎలాంటి అవకతవకలు జరగలేదు.
తమ ప్లాట్లు తమ చేతిల్లోనే ఉన్నాయని వారు నింపాదిగా ఉన్నారు. కానీ, వారం రోజుల కిందట కొందరు సదరు సర్వే నంబర్లో భూమిని దున్నేసి ఏకంగా పంట సైతం వేసేశారు. దీంతో ఆ వెంచర్లో ప్లాట్లు కొన్న సుమారు 100కి పైగా లబ్ధిదారులు కంగుతిన్నారు.
IAS Officer Y. Srilaxmi | శిఖరం నుంచి పతనం.. మళ్లీ బాధ్యతల వైపు : వై. శ్రీలక్ష్మి పరిపాలనా ప్రయాణం
Gandhari Land Encroachment | కలెక్టర్‌ను కలిసి విన్నవించుకుంటాం..
పట్టాతో పాటు అన్ని ధృవపత్రాలు తమ వద్ద ఉన్నాయని.. రాత్రికి రాత్రే తమ ప్లాట్లను దున్నేసి అక్రమార్కులు పంటలు సైతం వేసేశారని బాధితులు వాపోతున్నారు. ఈ విషయమై పూర్తి ఆధారాలతో త్వరలో తహశీల్దార్, కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొంటున్నారు.