Warangal Bhadrakali Temple | వరంగల్‌ భద్రకాళి ఆలయం దగ్గర ఉద్రిక్తత

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: Warangal Bhadrakali Temple | వరంగల్‌ (Warangal) భద్రకాళి ఆలయం దగ్గర శనివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. పలువురు బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

కాకతీయ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ (కుడా) భూముల వేలం వ్యవహారంలో అవినీతి జరిగిందని బీఆర్​ఎస్​ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం భద్రకాళి అమ్మవారి ఆలయంలోకి వెళ్లేందుకు యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం కుడా ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి తడి దస్తులతో అమ్మవారిని దర్శించుకున్నారు.

Warangal Bhadrakali Temple | సంప్రోక్షణకు పిలుపు

Warangal Bhadrakali Temple

ఆలయాన్ని రాజకీయాలతో అపవిత్రం చేశారని బీజేపీ నాయకులు ఆరోపించారు. గుడిని సంప్రోక్షణ చేస్తామని ఆ పార్టీ నాయకులు శనివారం తరలివచ్చారు. పసుపు నీళ్లతో ఆలయ ఆవరణలో శుభ్రం చేసేందుకు యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీజేపీ నాయకులు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు పలువురు నాయకులను అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు.

Warangal Bhadrakali Temple | పవిత్రతను దెబ్బ తీశారు

బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ మాట్లాడుతూ.. భద్రకాళి అమ్మవారి ఆలయ పవిత్రతను కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు దెబ్బతీశారన్నారు. ఓరుగల్లు ప్రజల ఆరాధ్య దైవమైన అమ్మవారి ఆలయాన్ని రాజకీయాలకు వేదికగా మార్చడం అత్యంత దురదృష్టకరమని విమర్శించారు. కుడా మాజీ ఛైర్మన్ మర్రి యాదవరెడ్డి, ప్రస్తుత ఛైర్మన్ వెంకట్రామరెడ్డి ఆలయంలో తడిబట్టలతో ప్రవేశించి ప్రమాణాలు చేయడం ఆలయ సంప్రదాయాలకు విరుద్ధమని, దీంతో ఆలయ పవిత్రతకు భంగం కలిగిందన్నారు.

ఇది కూడా చదవండి..: Telangana Police Recruitment | 5 వేల పోలీస్​ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్​ సిగ్నల్​.. అభ్యర్థులకు అలర్ట్​

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *