అక్షరటుడే వెబ్‌డెస్క్: KTR Kannepalli Visit | రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైతులకు సాగునీరు అందించే అవకాశం ఉన్నప్పటికీ, ఉద్దేశపూర్వకంగానే వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇవాళ కన్నెపల్లి పంప్‌హౌస్ సందర్శనకు బయలుదేరిన కేటీఆర్‌ను పోలీసులు జనగాం జిల్లా పెంబర్తి వద్ద అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
KTR Kannepalli Visit | వృథాగా పోతున్న లక్ష క్యూసెక్కుల నీరు..
కన్నెపల్లి వద్ద ప్రస్తుతం ఏకంగా లక్ష క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వృథాగా పోతోందని కేటీఆర్ వెల్లడించారు. పైన ఉన్న మిడ్ మానేరు, కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్రతి రిజర్వాయర్ నీటి కోసం ఎదురుచూస్తుంటే, కింద ఇంత నీరు వృథాగా పోవడం ప్రభుత్వ వైఫల్యమేనని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా నీళ్లు లేక రైతులు కనీసం నాట్లు వేయలేని దుస్థితిలో ఉన్నారని, ఈ ప్రభుత్వ దుర్మార్గమైన వైఖరిని రైతాంగానికి కళ్లకు కట్టేందుకే తాను కన్నెపల్లికి వెళ్తున్నానని కేటీఆర్ తెలిపారు.
KTR Kannepalli Visit | మేడిగడ్డతో సంబంధం లేదు..
మేడిగడ్డ బ్యారేజీ గేట్లతో సంబంధం లేకుండా, గోదావరిలో 93.5 మీటర్ల ఎత్తులో ప్రవాహం ఉంటే చాలు.. కన్నెపల్లి పంప్‌హౌస్‌లో మోటర్లు ఆన్ చేసి రైతులకి నీళ్లు అందించవచ్చని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణను సస్యశ్యామలం చేసేలా కేసీఆర్ ప్రాజెక్టులను డిజైన్ చేశారని, ఆ నిజాన్ని ప్రజల ముందు ఉంచడమే తన ఉద్దేశమని కేటీఆర్ చెప్పారు.
KTR Kannepalli Visit | రేవంత్ రెడ్డిపై ఘాటు విమర్శలు..
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. “పంటలకు నీళ్లిస్తే మళ్లీ యూరియా ఇవ్వాలి, పంట కొనాలి, మద్దతు ధర ఇవ్వాలి, బోనస్ ఇవ్వాలి.. అందుకే రైతులను ప్రభుత్వం కావాలనే ఎండబెడుతోంది” అని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గపు ఆలోచనలు బయటపడతాయనే భయంతోనే రేవంత్ రెడ్డి అనే ‘సన్నాసి’ సూచనల మేరకే పోలీసులు తనను అడ్డుకుంటున్నారని ఆయన ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఉన్నది “చేతగాని దద్దమ్మ ప్రభుత్వం” అని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
KTR Kannepalli Visit | కేటీఆర్ సవాల్..
తన పర్యటనను అడ్డుకుంటున్న పోలీసులపై స్పందిస్తూ.. “ప్రభుత్వానికి దమ్ముంటే, చేతనైతే మంచి పనులు చేసి ప్రజల ముందుకొచ్చి గెలవండి” అని సవాలు విసిరారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కన్నెపల్లికి చేరుకుని తీరుతామని, అక్కడ వృథాగా పోతున్న నీటిని రైతులకు చూపించి, ఈ ప్రభుత్వం ఎంత చేతగానిదో ప్రజలకు వివరిస్తానని కేటీఆర్ స్పష్టం చేశారు.
కాంగ్రెస్ సర్కార్ పోలీసులను పెట్టి ఎంత అడ్డుకునే ప్రయత్నం చేసినా తప్పకుండా కన్నెపల్లి పంప్ హౌస్ వద్దకు చేరుకుంటాం..
వృథాగా పోతున్న లక్ష క్యూసెక్కుల కాళేశ్వరం జలాలను రైతులకు చూపెడుతాం..
నీళ్లను ఎత్తిపోయకుండా రైతుల పొలాలను ఎండబెట్టే కుట్ర చేస్తున్న రేవంత్ సర్కార్ దుర్మార్గపు… pic.twitter.com/OOV0W8FEo9
— BRS Party (@BRSparty) July 5, 2026
ఇది కూడా చదవండి: Hotel Food Safety | ఆహారం భద్రమేనా.. పరిశుభ్రత పాటించని హోటళ్లు