అక్షరటుడే, వెబ్‌డెస్క్: Rythu Bharosa | రాష్ట్రంలోని రైతులకు రైతు భరోసా కింద ప్రభుత్వం నిధులను జమ చేస్తోంది. విడతల వారిగా అన్నదాతల ఖాతాల్లో డబ్బులు వేస్తోంది. సోమవారం 7 ఎకరాల వరకు భూమి ఉన్న వారికి నిధులను విడుదల చేసింది.
వానాకాలం సీజన్‌కు సంబంధించి రైతు భరోసా నిధుల విడుదలను సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) జూన్ 30న ప్రారంభించారు. ఆ రోజు రెండు ఎకరాల్లోపు ఉన్న రైతులకు నిధులు విడుదల చేశారు. అనంతరం రోజుకో ఎకరం పెంచుకుంటూ రైతు భరోసా జమ చేస్తున్నారు. దీంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో పెట్టుబడి సాయం అందుతుండటంతో అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సిన బాధలు తప్పాయని పేర్కొంటున్నారు.
Rythu Bharosa | రూ.354 కోట్లు జమ

రైతు భరోసా కింద శనివారం వరకు ఆరు ఎకరాల్లోపు భూమి ఉన్న 67.44 లక్షల మంది రైతులకు ప్రభుత్వం రూ.7,135 కోట్లు జమ చేసింది. ఆదివారం సెలవు కావడంతో నిధులు విడుదల చేయలేదు. ఏడు ఎకరాల్లోపు భూమి ఉన్న 92,729 మంది రైతుల ఖాతాల్లో సోమవారం రూ.354.96 కోట్లు జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 68.37 లక్షల మంది రైతులకు రూ.7,490.72 కోట్ల రైతు భరోసా నిధులు అందించామన్నారు.
ఇది కూడా చదవండి..: Mulugu Development Works | జిల్లా అభివృద్ధిపై మంత్రి సీతక్క రివ్యూ.. అధికారులకు కీలక సూచనలు