అక్షరటుడే, కామారెడ్డి: Power Cut Protest | పాల్వంచ మండలం ఆరేపల్లి (Arepally) గ్రామంలో విద్యుత్ కోతలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్‌స్టేషన్ ఆపరేటర్‌ను నిర్బంధించి నిరసన తెలిపారు. కామారెడ్డిలో(Kamareddy) ఈ ఘటన కలకలం రేపింది.
Power Cut Protest | మూడు రోజులుగా పవర్ కట్
గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా పవర్ కట్(Power Cut) అవుతుండటంతో సోమవారం విద్యుత్ సబ్ స్టేషన్ ఆపరేటర్‌ను లోపలే నిర్బంధించి తాళం వేశారు. ప్రస్తుతం వరి నాట్ల సీజన్ కావడంతో రైతులంతా నారుమడులు సిద్ధం చేసుకుని పొలాల్లోకి దిగుతున్నారు. కానీ రోజుకు కొన్ని గంటలు మాత్రమే కరెంట్ ఇస్తుండటంతో బోరు మోటార్లు నడవడం లేదు. ఫలితంగా వేసిన నారు ఎండిపోతుందని, సాగు అంతా నష్టపోయే పరిస్థితి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు లేకపోతే వరినాట్లు వేయడం కష్టమని పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని ఆరోపించారు.
అధికారులు స్పందించకపోవడంతో విసిగిపోయిన రైతులు నేరుగా సబ్ స్టేషన్‌కు వెళ్లి ఆపరేటర్‌ను అడ్డుకున్నారు. ఉన్నతాధికారులు వచ్చి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేంతవరకు తాము కదిలే ప్రసక్తే లేదని భీష్మించుకుని కూర్చున్నారు. వెంటనే విద్యుత్ సరఫరాలో కోతలు ఆపి, వరినాట్ల సమయంలో 24 గంటల కరెంటు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మరింత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: బండి భగీరథ్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్