Miyapur Murder Case | ఇల్లాలి ఘాతుకం.. ప్రియుడితో కలిసి భర్తని చంపి పూడ్చిపెట్టిన భార్య

నిజామాబాద్‌లో భర్తకు హార్పిక్ ఎక్కించి చంపిన ఘటన మరువకముందే, రాష్ట్రంలో మరో దారుణం వెలుగుచూసింది.

Shivam nagarani

అక్షరటుడే  వెబ్‌డెస్క్: Miyapur Murder Case | నిజామాబాద్‌లో భర్తకు హార్పిక్ ఎక్కించి చంపిన ఘటన మరువకముందే, రాష్ట్రంలో మరో దారుణం వెలుగుచూసింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కక్షతో భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసిందో మహిళ. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు మృతదేహాన్ని మహారాష్ట్ర సరిహద్దులకు తరలించి పూడ్చిపెట్టింది. మియాపూర్‌లో  జరిగిన ఈ దారుణం, తాజాగా పోలీసుల చాకచక్యంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Miyapur Murder Case | మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని ..

గతేడాది నవంబర్‌లో తన భర్త కనిపించడం లేదని సత్యవతి అనే మహిళ మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా సత్యవతి కాల్ డేటాను విశ్లేషించగా, ఒక వ్యక్తి నంబర్ నుండి ఆమెకు తరచూ ఫోన్ కాల్స్ వస్తున్నట్లు, ఎక్కువసేపు మాట్లాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా, అసలు నిజాలు బయటపడ్డాయి.

Miyapur Murder Case | కుట్ర పూరితంగా హత్య..

తమ అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉండటంతో, అతడిని శాశ్వతంగా అడ్డు తొలగించుకోవాలని సత్యవతి పథకం వేసింది. నవంబర్‌లో భర్తకు అన్నంలో నిద్రమాత్రలు కలిపి తినిపించింది. అతడు గాఢ నిద్రలో ఉండగా దిండుతో ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసింది. ఆ తర్వాత తన ప్రియుడితో కలిసి మృతదేహాన్ని మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతానికి తరలించింది. అక్కడ మరో స్నేహితుడి సహాయంతో మృతదేహంపై పెట్రోల్ పోసి తగులబెట్టి, మిగిలిన అవశేషాలను భూమిలో పూడ్చిపెట్టినట్లు తెలిపారు.

Miyapur Murder Case | పోలీసుల దర్యాప్తు..

తొమ్మిది నెలల పాటు కేసును మిస్సింగ్‌గా నమ్మించేందుకు నిందితురాలు ప్రయత్నించింది. అయితే, పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడటంతో మహారాష్ట్ర పోలీసుల సహకారంతో నిందితులు పూడ్చిపెట్టిన చోట మృతదేహ అవశేషాలను వెలికితీశారు. ఈ కేసుపై మరిన్ని వివరాలను వెల్లడించేందుకు పోలీసులు రేపు ( జులై 8 )మధ్యాహ్నం మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు.

ఇది కూడా చదవండి:  Steel Bank Bheemgal | భీమ్​గల్​లో ‘స్టీల్​ బ్యాంక్​’ ప్రారంభం.. ప్లాస్టిక్ రహిత మండలం​ దిశగా ముందడుగు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *