YouTuber Ravan Arrest | యూట్యూబర్ రావణ్ అరాచకాలు.. ఫోరెన్సిక్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ నిజాలు

హిందూ దేవతలు, ప్రజాప్రతినిధులపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఇప్పటికే పలు కేసుల్లో అరెస్టయిన యూట్యూబర్ రావణ్ (బచ్చలకూరి జోసెఫ్) అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: YouTuber Ravan Arrest | హిందూ దేవతలు, ప్రజాప్రతినిధులపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఇప్పటికే పలు కేసుల్లో అరెస్టయిన యూట్యూబర్ రావణ్ (బచ్చలకూరి జోసెఫ్) అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఆయన ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపగా వచ్చిన నివేదిక పోలీసులను సైతం నివ్వెరపరిచింది.

YouTuber Ravan Arrest | ఫోరెన్సిక్ రిపోర్టులో షాకింగ్ నిజాలు..

పోలీసుల కళ్లు గప్పేందుకు రావణ్ తన ఫోన్‌లోని డేటాను డిలీట్ చేశాడు. అయితే, అత్యాధునిక సాంకేతికతతో ఆ డేటాను రికవర్ చేసిన పోలీసులు దిగ్భ్రాంతికరమైన విషయాలను గుర్తించారు. అమాయక యువతులను టార్గెట్ చేసుకుని, వారితో ఏకాంతంగా ఉన్న సమయాల్లో రహస్యంగా ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడినట్లు తేలింది. రికవరీ చేసిన డేటా ఆధారంగా ఇప్పటివరకు సుమారు 10 మంది బాధితులను పోలీసులు గుర్తించారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

YouTuber Ravan Arrest | దేశద్రోహ అభియోగాలు..

ఫోన్‌లో భారీగా అశ్లీల వీడియోలు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు, ఆ దిశగా దర్యాప్తును వేగవంతం చేశారు. కేవలం వ్యక్తిగత అకృత్యాలే కాకుండా, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు రావణ్ పాల్పడినట్లు గన్నవరం పోలీసులు నిర్ధారించారు. మావోయిస్టు భావజాలంతో ప్రజలను రెచ్చగొట్టడం, సాయుధ తిరుగుబాటును ప్రోత్సహించడం వంటి ఆరోపణలతో ఆయనపై బీఎన్‌ఎస్ (BNS) సెక్షన్ 152తో పాటు కఠినమైన ‘ఉపా’ (UAPA) చట్టం కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసులో ఆయన రిమాండ్‌లో ఉన్నారు.

YouTuber Ravan Arrest | దర్యాప్తు ముమ్మరం..

రావణ్ బాధితులు ఎంతమంది ఉన్నారనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు. అతడి నెట్‌వర్క్ ఎవరెవరు ఉన్నారనే అంశంపై కూడా దృష్టి సారించారు. నిందితుడిపై ఉన్న సెక్షన్ల తీవ్రత దృష్ట్యా, అతడికి కఠిన శిక్ష పడేలా పక్కా ఆధారాలు సేకరిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి:  Devadula Water Lift | దేవాదుల నీటిని ఎందుకు ఎత్తిపోయడం లేదు : హరీశ్​రావు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *