అక్షరటుడే వెబ్‌డెస్క్: Tadicherla 2 Coal Mine | తెలంగాణలో తాడిచెర్ల-2 బొగ్గు గని కేటాయింపు వ్యవహారం రాజకీయంగా వేడెక్కింది. ఈ గనిని సింగరేణికి కేటాయించామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ( Bhatti Vikramarka ) తీవ్ర స్థాయిలో స్పందించారు. వాస్తవాలను దాచిపెట్టి బీజేపీ తప్పుదోవ పట్టిస్తోందని ఆయన విమర్శించారు.
Tadicherla 2 Coal Mine | బీజేపీ కొత్తగా చేసిందేమీ లేదు..
మీడియాతో మాట్లాడిన భట్టి విక్రమార్క, తాడిచెర్ల-2 కేటాయింపు విషయంలో కిషన్ రెడ్డి చేస్తున్న వాదనలను ఖండించారు. “ఈ బొగ్గు గనిని 2013లోనే నాటి యూపీఏ ప్రభుత్వం సింగరేణికి కేటాయించింది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కొత్తగా చేసింది ఏమీ లేదు. కేటాయింపు జరిగినప్పటికీ, గత పదేళ్లుగా మైనింగ్ లీజు అనుమతులు ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టారు” అని ఆయన వివరించారు.
Tadicherla 2 Coal Mine | రాష్ట్ర ప్రభుత్వ పోరాటంతోనే అనుమతులు..
కొత్త చట్టాల పేరుతో ఈ గనిని సింగరేణికి దక్కకుండా చేసే ప్రయత్నాలు జరిగాయని భట్టి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రధానిని , కేంద్ర మంత్రులను కలిసి వాస్తవాలను వివరించామని, తమ నిరంతర ప్రయత్నాల వల్లే ఇప్పుడు అనుమతులు లభించాయని తెలిపారు. అనుమతులు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెబుతూనే, కేంద్రం వాస్తవాలను ఒప్పుకోవాలని ఆయన సూచించారు.
Tadicherla 2 Coal Mine | సింగరేణి గనులన్నీ వారికే ఇవ్వాలి..
బీజేపీకి నిజంగానే తెలంగాణపై, సింగరేణి సంస్థపై ప్రేమ ఉంటే.. సింగరేణి పరిధిలో ఉన్న అన్ని గనులను ఆ సంస్థకే కేటాయించాలని డిప్యూటీ సీఎం డిమాండ్ చేశారు. తాడిచెర్ల-2 కేటాయింపు విషయంలో బీజేపీ చేస్తున్న వాదనలు కేవలం క్రెడిట్ కొట్టేయడానికేనని ఆయన వ్యాఖ్యానించారు. ఈ అంశం ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీల మధ్య కోల్డ్ వార్‌గా మారింది.
ఇది కూడా చదవండి: Private Schools Notice | రెండు ప్రైవేట్ పాఠశాలలకు నోటీసులు.. పాఠ్యపుస్తకాల గది సీజ్