Trump Warns Iran | ఈ రాత్రికి ఇరాన్‌పై భీకర దాడులు.. మరోసారి హెచ్చరించిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​ ఇరాన్​కు​ వార్నింగ్​ ఇచ్చారు. ఈ రాత్రికి భీకర దాడులు చేస్తామన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Trump Warns Iran | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. అమెరికా–ఇరాన్​ శాంతిచర్చలతో కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న ప్రాంతం.. మరోసారి బాంబుల మోతతో దద్దరిల్లుతోంది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్ (Donald Trump)​ ఇరాన్​కు​ వార్నింగ్​ ఇచ్చారు. ఈ రాత్రికి భీకర దాడులు చేస్తామన్నారు.

ఇరాన్​ ఇటీవల పలు వాణిజ్య నౌకలపై దాడులు చేయడంతో మరోసారి ఉద్రిక్తతలు మొదలు అయ్యాయి. ఇరాన్​ దాడులకు ప్రతిగా అమెరికా టెహ్రాన్​పై వైమానిక దాడులు చేసింది. దీంతో ఇరాన్​ సైతం ధీటుగానే స్పందించింది. గల్ఫ్​ దేశాల్లోని అమెరికా స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. దీంతో కాల్పుల విరమణ ముగిసిందని ట్రంప్​ ప్రకటించారు. అనంతరం కొద్దిగంటలకే ఇరాన్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ, ఈ రాత్రి ఆ దేశంపై “తీవ్రమైన దాడి” చేస్తామని ఆయన పేర్కొన్నారు.

Trump Warns Iran | నాటో సదస్సులో..

ట్రంప్​ టర్కీలోని అంకారాలో జరిగిన నాటో (NATO) సదస్సులో మాట్లాడారు. నిన్న రాత్రి వారిపై చాలా గట్టిగా దాడి చేశాం. ఈ రాత్రి కూడా వారిపై గట్టిగా దాడి చేస్తాం. వారికి ఒక చిన్న హెచ్చరిక ఇస్తున్నాను అని ట్రంప్​ అన్నారు. ఇరాన్ ప్రవర్తన “విచిత్రంగా” (పిచ్చిగా) ఉందన్నారు. ఇరాన్ అణు నిరాయుధీకరణ కోసం చర్చలు జరిగాయని, ఇరు పక్షాలు సమావేశాల్లో దీని గురించి చర్చించినప్పటికీ, ఆ తర్వాత ఇరాన్ ప్రతినిధులు విలేకరుల సమావేశాలకు వెళ్లి అటువంటి చర్చలేవీ జరగలేదని ప్రకటించేవారని పేర్కొన్నారు. 47 ఏళ్లుగా వారు మధ్యప్రాచ్యంలో ఆధిపత్యం చెలాయిస్తూ వ్యవహరించారన్నారు. కానీ ఇకపై వారు ఆధిపత్యం చెలాయించలేరన్నారు.

Trump Warns Iran | ఖర్గ్​ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటాం

ఈ రాత్రి జరగబోయే దాడి భారీగా ఉండవచ్చని, అమెరికా “ఖర్గ్ ద్వీపాన్ని” కూడా స్వాధీనం చేసుకోవచ్చని ట్రంప్ హెచ్చరించారు. అమెరికా నౌకాదళ దిగ్బంధం గురించి స్పందిస్తూ, అది కేవలం ఇరాన్‌కు మాత్రమే వర్తిస్తుందని, ఇతర దేశాలు “తమకు కావలసినవి పొందవచ్చని” ఆయన స్పష్టం చేశారు. కాగా ట్రంప్​ గతంలో రెండు సార్లు ఇదేవిధంగా ఇరాన్​ను (Trump Warns Iran) హెచ్చరించారు. భారీ ఎత్తున దాడులు చేస్తామని, మౌలిక సదుపాయాలు ధ్వంసం చేస్తామన్నారు. ఖర్గ్​ (Kharg) ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటామని పేర్కొన్నారు. ఆ రెండు సమయాల్లో రాత్రికి రాత్రే ట్రంప్​ వెనక్కి తగ్గి కాల్పుల విరమణకు ఓకే చెప్పారు. దీంతో మరోసారి ఏం జరుగుతుందోనని ఉత్కంఠ నెలకొంది. పెద్ద ఎత్తున దాడి చేస్తే ఇరాన్​ సైతం తీవ్రంగా స్పందించే అవకాశం ఉండటంతో అగ్రరాజ్యం మరోసారి కాల్పుల విరమణకు మొగ్గు చూపే అవకాశం ఉంది.

దీనిని కూడా చదవండి : ACB Raid Mahabubnagar | ఏసీబీకి చిక్కిన సర్వే, ల్యాండ్​ రికార్డ్స్​ సూపరింటెండెంట్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *