అక్షరటుడే, తెయూ క్యాంపస్: Telangana University | తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులు క్యాంపస్ ప్లేస్మెంట్స్(Campus Placements) సాధించారు. ఈ మేరకు వర్సిటీ అధికారులు వివరాలు వెల్లడించారు.
Telangana University | బయోటెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో..
బయోటెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్(Hyderabad), జీనోమ్ వ్యాలీలోని ఇచోర్ బయోలాజిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో కలిసి క్యాంపస్ ప్లేస్మెంట్ నిర్వహించారు. ఇచోర్ బయోలాజిక్స్ సంస్థ ప్రతినిధులు గణేష్, నవీన్ కుమార్, ఫణీంద్ర హాజరయ్యారు. బయోటెక్నాలజీ, బోటనీ, జువాలజీ విభాగాల ఫైనల్ ఇయర్ విద్యార్థులతో పాటు అనుబంధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ చేపట్టగా 12 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులను విభాగాధిపతి ప్రసన్న శీల, అధ్యాపకులు అభినందించారు. విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించినందుకు ఇచోర్ బయోలాజిక్స్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
Telangana University | సీపీగెట్ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలి
ఈనెల 15వ తేదీ వరకు జరిగే సీపీగెట్-2026 (CPGET-2026) ప్రవేశ పరీక్షలను నిరంతరం పర్యవేక్షించాలని ఏవీ ఎంటర్ప్రైజెస్ సీబీటీ ఎగ్జామ్ సెంటర్ ఛైర్మన్ ఆయుబ్ బిన్ హబీద్, కాకతీయ ఇన్స్టిట్యూషన్ ప్రధానాచార్యులు మహమ్మద్ ఫరీదుద్దీన్ బుధవారం కోరారు. ఈమేరకు తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరికి సూచించారు. అనంతరం రిజిస్ట్రార్ మాట్లాడుతూ.. ఉత్తర తెలంగాణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నడుస్తున్న ఈ సెంటర్ ఈ ప్రాంత విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. పరీక్షలను ఎలాంటి లోపాలు లేకుండా, అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నామన్నారు.
Telangana University | పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన వీసీ
తెలంగాణ యూనివర్సిటీలో డిగ్రీ బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ కోర్సుల 1, 2, 3, 4, 5, 6 సెమిస్టర్ల బ్యాక్లాగ్ వన్ టైమ్ ఛాన్స్ పరీక్షలు కొనసాగుతున్నాయి. పరీక్ష కేంద్రాన్ని వీసీ ప్రొఫెసర్ యాదగిరిరావు తనిఖీ చేశారు. ఉదయం జరిగిన పరీక్షలకు 52 మంది విద్యార్థులకు 48 మంది, మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 35 మంది విద్యార్థులకు 32 మంది హాజరైనట్లు ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు.
ఇది కూడా చదవండి: #Ladakh : లేహ్ ఎయిర్ పోర్టు నిర్మాణం చివరికి చేరుకుంది. దీనిని త్వరలో ప్రారంభించనున్నారు.