అక్షరటుడే, వెబ్‌డెస్క్: Train Honeymoon Setup | ఆ కొత్త జంట తమ తొలి ప్రయాణాన్ని అందంగా ప్లాన్ చేసుకున్నారు. ఏకంగా రైలులోనే హనీమూట్ సెటప్‌లో డెకరేషన్ చేయించారు. అయితే వారి సెటప్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. అధికారులు ఒక టీటీఈని సస్పెండ్ చేశారు.
నందిగ్రామ్ ఎక్స్‌ప్రెస్ (రైలు నం. 11002)లో ప్రయాణిస్తున్న ఒక జంట జూలై 6న తమ ‘ఫస్ట్ ఏసీ కూపే’ను అలంకరించుకోవడానికి ఆన్‌లైన్ ద్వారా ఒక డెకరేటర్‌ను వ్యక్తిగతంగా ఏర్పాటు చేసుకున్నారు. జాల్నా స్టేషన్ (Jalna Station) వద్ద ఆ డెకరేటర్ కోచ్‌లోకి అనుమతి లేకుండా ప్రవేశించారు. అనంతరం హనీమూన్ సెటప్‌లో కోచ్‌ను అలంకరించాడు. ఈ వీడియో వైరల్ కావడంతో రైల్వే భద్రతపై పలువురు ప్రశ్నలు లేవనెత్తారు. బయటి వ్యక్తులు అనుమతి లేకుండా ఎలా కోచ్‌లోకి వచ్చారని ప్రశ్నించారు.
Train Honeymoon Setup | రైల్వే శాఖ చర్యలు

ఈ విషయం రైల్వే మంత్రిత్వ శాఖ దృష్టికి వెళ్లింది. సదరు డెకరేటర్ అనుమతి లేకుండా ప్రవేశించడం అనధికారికమైన చర్య అని, ఇది తీవ్రమైన లోపంగా అధికారులు పరిగణించారు. దీనికి బాధ్యుడిని చేస్తూ ఒక టీటీఈని సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై సమగ్రమైన శాఖాపరమైన విచారణకు ఆదేశాలు చేశారు. ప్రీమియం కోచ్‌లలోకి అనధికారికంగా ప్రవేశించడం ప్రయాణికుల భద్రతకు, రైల్వే భద్రతకు ముప్పు కలిగిస్తుందని పేర్కొంటూ, రైల్వే అధికారులు ఈ లోపాన్ని “అత్యంత తీవ్రమైనది”గా అభివర్ణించారు. రైలులోకి అనధికారికంగా ప్రవేశించడం, చెల్లుబాటు అయ్యే టిక్కెట్టు లేకుండా ప్రయాణించడం వంటి నేరాలకు గాను ఆ డెకరేటర్‌పై కేసు నమోదు చేశారు.
ఇది కూడా చదవండి..: Hingoli Earthquake | హింగోలిని వణికించిన నాలుగు భూకంపాలు.. భూగర్భ గర్జనతో భయాందోళనలో ప్రజలు