Liquor Ban Resolution | మద్యం అమ్మితే రూ.లక్ష జరిమానా.. ఆర్గొండలో మద్యపానాన్ని నిషేధిస్తూ ఏకగ్రీవ తీర్మానం

విచ్చలవిడిగా మద్యం బెల్టు షాపులు నిర్వహిస్తుండటంతో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Liquor Ban Resolution | విచ్చలవిడిగా మద్యం బెల్టు షాపులు నిర్వహిస్తుండటంతో (Kamareddy) అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా పల్లెల్లో బెల్టు షాపులలో ఎప్పుడు పడితే అప్పుడు మద్యం లభిస్తుండటంతో సాధారణ కూలి చేసుకునే ప్రజలతో పాటు యువత మద్యానికి బానిసలవుతున్నారు.

Liquor Ban Resolution | రాజంపేట మండలం ఆర్గొండలో..

ఈ క్రమంలో రాజంపేట(Rajampet) మండలం ఆర్గొండ గ్రామస్తులు మద్యపానం నిషేధిస్తూ(Alcohol Prohibition) తీర్మానం చేశారు. గురువారం గ్రామంలో సర్పంచ్ విక్రాంత్ రెడ్డి, పాలకవర్గ సభ్యులు, గ్రామస్తుల సమక్షంలో ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గ్రామంలో మద్యం విక్రయాలు జరపడం వల్ల కలిగే పరిణామాలపై తీవ్రంగా చర్చించారు. మద్యం విక్రయాలకు చెక్ పెడుతూ ఊరంతా ఒక్కటిగా నిర్ణయానికి వచ్చారు. గ్రామంలో శుక్రవారం నుంచి మద్యపానం నిషేధిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఇకపై గ్రామంలో మద్యం విక్రయాలు జరిపితే రూ.లక్ష జరిమానా విధిస్తూ తీర్మానించారు. అలాగే గ్రామస్తుల నిర్ణయాన్ని లెక్క చేయకుండా చాటుగా విక్రయాలు జరిపినట్టుగా తెలిస్తే సమాచారం అందించిన వారికి రూ.10 వేలు బహుమతి ప్రకటించారు. గ్రామ శివారులోని బస్వన్నపల్లి వరకు ఈ తీర్మానం వర్తిస్తుందని పేర్కొన్నారు.

Belt shop

ఇది కూడా చదవండి : #JanaNayagan కు సెన్సార్ పూర్తి… ‘A’ సర్టిఫికెట్!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *