అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Harish Rao Counter | సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) కి మాజీ మంత్రి హరీశ్‌రావు కౌంటర్ ఇచ్చారు. ‘మాట తప్పడం, పార్టీలు మారడం నీ రాజకీయ సంస్కృతి కావొచ్చు. కానీ నాది కాదు. నీలాగా ఒట్టు వేసి ఒక మాట, ఒట్టు వేయకుండా మరో మాట చెప్పే అలవాటు నాకు లేదు’ అన్నారు.
భద్రాద్రి శ్రీరాముడి సాక్షిగా సంపూర్ణ రుణమాఫీ చేస్తానని చేసిన ప్రమాణం ఏమైందని హరీశ్‌రావు ప్రశ్నించారు. కనీసం నువ్వు సభ పెట్టిన ఖమ్మం జిల్లాలో అయినా రైతులందరికీ పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగిందా అన్నారు. చివరి ఏడాదిలో రాజకీయాలు చేద్దాం అంటున్న సీఎం.. ప్రతి బహిరంగ సభలో ఎందుకంత ఆవేశంతో, అసహనంతో రగిలిపోతున్నారని విమర్శించారు. కన్నెపల్లి నుంచి నీళ్ళు లిఫ్ట్ చేయని చేతగాని తనాన్ని అబద్ధాలతో కవర్ చేసుకోవాలని చూడటం హీనమైన చర్య అని అభివర్ణించారు.
Harish Rao Counter | జల దోపిడీకి తలుపులు తెరిచారు
కన్నెపల్లి పంపు హౌస్ (Kannepalli Pumphouse) నుంచి నీళ్లను లిఫ్ట్ చేసి అన్నారం, సుందిళ్ల ద్వారా ఎల్లంపల్లికి తరలించాలని చెబుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని హరీశ్‌రావు ప్రశ్నించారు. సమైక్య రాష్ట్రం నాటి తెలంగాణ జలాల దోపిడీకి తలుపులు తెరిచారని విమర్శించారు. తెలంగాణ జలాలను తన గురువు చంద్రబాబుకు కప్పం కడుతున్నట్లుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. నీళ్లు ఉండి కూడా ఎత్తిపోయకుండా, రిజర్వాయర్లు నింపకుండా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి వైఖరి తెలంగాణకు శాపంగా, ఆంధ్రప్రదేశ్‌కు వరంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీనిని కూడా చదవండి : Bhatti Vikramarka | మహిళల ఆర్థికాభివృద్ధికి పెద్దపీట.. భట్టి విక్రమార్క కీలక ప్రకటన