అక్షరటుడే, వెబ్‌డెస్క్: Telangana EHS Health Cards | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (EHS) కింద హెల్త్ కార్డులను జులై 15, 2026 నుంచి అమలు చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధ్యక్షతన నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో నిర్ణయించారు.
Telangana EHS Health Cards | 13న మార్గదర్శకాలపై చర్చ
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా త్వరలో ఉద్యోగులకు హెల్త్ కార్డులను అధికారికంగా పంపిణీ చేయనున్నట్లు సమావేశంలో వెల్లడించారు.
ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన, నగదు రహిత వైద్య సేవలు అందించేందుకు ఈ హెల్త్ కార్డు విధానం ఉపయోగపడుతుందని సమావేశంలో అభిప్రాయపడుతూ, అమలుకు సంబంధించిన ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.

Telangana EHS Health Cards | క్యూఆర్ కోడ్‌తో కార్డు డౌన్లోడ్..
క్యూఆర్ కోడ్ తో నూతన హెల్త్ కార్డులు మొబైల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ మేరకు అన్ని వివరాలతో EHCT యాప్ రూపొందిస్తారు. ఇక చికిత్సలకు CGHS రేట్లు వర్తింపజేస్తారు. త్వరలోనే నూతన EHS మార్గదర్శకాల జీవో విడుదల చేస్తారు.
రాష్ట్ర వ్యాప్తంగా 943 హాస్పిటల్స్ లో హెల్త్ కార్డులపై నగదు రహిత వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. 2594 ప్రొసీజర్స్ కవర్ అవుతాయి. నూతన EHS మార్గదర్శకాలపై చర్చ కోసం సోమవారం (13.07.2026) CEO తో సమావేశం ఉంటుంది.