భీమ్‌గల్, అక్షరటుడే: Bheemgal Oora Panduga | పట్టణంలో అత్యంత భక్తిశ్రద్ధలతో, సాంప్రదాయబద్ధంగా నిర్వహించే ‘ఊర పండుగ’కు సర్వం సిద్ధమైంది. ఆది, సోమవారాల్లో రెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు సర్వసమాజ్ కమిటీ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేసినట్లు కమిటీ అధ్యక్షుడు కృష్ణ తెలిపారు.
Bheemgal Oora Panduga | పట్టణ ప్రజలు తరలిరావాలి
పట్టణ (Bheemgal) ప్రజలందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి, ఈ సాంప్రదాయ పండుగను విజయవంతం చేయాలని కృష్ణ విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఉదయం 7 గంటలకు సాంప్రదాయబద్ధంగా చెట్టు కొట్టడం కార్యక్రమంతో వేడుకలు ప్రారంభమవుతాయి. ఉదయం 9 గంటలకు మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా వెళ్లి, వడ్ల సంఘంలో విగ్రహాల కర్రలను అప్పగిస్తారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత భూలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద పూజ కార్యక్రమాలు వైభవంగా ప్రారంభమవుతాయి. రాత్రి 10 తర్వాత మైసమ్మ గుడి వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాల ప్రారంభంతో మొదటిరోజు వేడుకలు ముగుస్తాయి.
Bheemgal Oora Panduga | సరి కార్యక్రమం..
సోమవారం ఉదయం ‘సరి చల్లడం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఉదయం 9 గంటలకు భక్తజన సందోహం నడుమ దేవుడి ఊరేగింపు అత్యంత వైభవంగా సాగుతుంది. మధ్యాహ్నం ఒంటిగంటలకు మాలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. కార్యక్రమంలో సర్వ సమాజ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Cobra in Scooter | స్కూటీలో నాగుపాము ప్రత్యక్షం.. కామారెడ్డిలో ఘటన