అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: SIR Process Review | జిల్లాలో కొనసాగుతున్న ‘సర్’ ప్రక్రియను అర్బన్ పరిధిలో వంద శాతం పూర్తి చేయాలని నిజామాబాద్ డీసీసీ (DCC Nizamabad) అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ (Bobbili Ramakrishna) కోరారు. శనివారం జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో ఆయన ఆధ్వర్యంలో కార్పొరేటర్లు, డివిజన్ ఇన్ఛార్జీలు, బీఎల్ఏలు, సూపర్వైజర్లకు సర్ ప్రక్రియపై దిశా నిర్దేశం చేశారు.
SIR Process Review |పీసీసీ చీఫ్ సొంత నియోజకవర్గంలో..
బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ.. నిజామాబాద్ అర్బన్ (Nizamabad Urban) పీసీసీ అధ్యక్షుడి సొంత నియోజకవర్గం అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేసి ఈ ప్రక్రియను విజయవంతం చేయాలని కోరారు. ఇందుకోసం ఇప్పటికే అన్ని డివిజన్లకు మెంటర్లను నియమించినట్లు తెలిపారు. డివిజన్లలోని ఒక నిర్దిష్ట ప్రాంతంలో పార్టీ నాయకులందరూ అందుబాటులో ఉంటూ, ఓటర్లకు ఫారాలు నింపడంలో సహాయపడాలన్నారు. అవసరమైన చోట ప్రత్యేక క్యాంప్లు నిర్వహించాలని సూచించారు. ప్రతి డివిజన్లో ఇంటింటికీ వెళ్లి ఫారాలు సేకరించి, వాటిని పూర్తి చేయడానికి వలంటీర్లను నియమించుకోవాలని పేర్కొన్నారు.
SIR Process Review | బాధ్యతాయుతంగా పనిచేయాలి
కార్పొరేటర్లు, పోటీ చేసి ఓడిపోయిన వారు, బీఎల్ఏ సూపర్వైజర్లు తమ తమ డివిజన్లలో వలంటీర్లను సమన్వయం చేసుకుంటూ, ప్రతి ఇంటిని సందర్శించి ఓటర్లకు పూర్తి స్థాయిలో సహాయం అందించాలని రామకృష్ణ సూచించారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు రత్నాకర్, జావీద్ అక్రమ్, అర్బన్ ఈఆర్వో (ERO) కో-ఆర్డినేటర్ అబ్దుల్ వహీద్, డీసీసీ ఉపాధ్యక్షుడు రత్నాకర్ గౌడ్, డీసీసీ కార్పొరేషన్ ఉపాధ్యక్షులు విజయ్ పాల్ రెడ్డి, సలీం, కోశాధికారి సకినాల శివ పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: హైదరాబాద్ నగరానికి తాగునీరు సరఫరా చేసే గోదావరి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు