అక్షరటుడే, ఆర్మూర్ : Armoor Cordon Search | ఆర్మూర్(Armoor) మున్సిపల్ పరిధిలోని నల్ల పోచమ్మ గల్లీలో ఆదివారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
Armoor Cordon Search | ఇంటింటికీ తిరుగుతూ..
ఎస్‌హెచ్‌వో ఆధ్వర్యంలో పోలీసు బృందం ఇంటింటికీ తిరుగుతూ ప్రజలు వివరాలు సేకరించారు. అనుమానిత వ్యక్తుల గురించి ఆరా తీశారు. వారి ఆధార్ కార్డులను ఇతరత్రా వివరాలను పరిశీలించారు. ఎన్నాళ్లుగా ఆ ప్రాంతంలో ఉంటున్నారు.. చేస్తున్న పనుల వివరాలను నమోదు చేసుకున్నారు.
Armoor Cordon Search | 50కి పైగా వాహనాలు స్వాధీనం
సెర్చ్‌లో భాగంగా సరైన ధ్రువపత్రాలు లేని 50 బైక్‌లను, మూడు ఆటోలను సీజ్(Vehicle Seizure,) చేశారు. అనంతరం ఎస్‌హెచ్‌వో మాట్లాడుతూ.. ప్రతి వాహనానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను వెంట ఉంచుకోవాలని సూచించారు. కాలనీల్లో ఎవరైనా అనుమానిత వ్యక్తులు సంచరిస్తే వెంటనే 100కు లేదా స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు. ప్రతి ఇంటికి తప్పనిసరిగా సీసీ కెమెరాలు అమర్చుకుంటే నేరాల కట్టడికి అవకాశం ఉంటుందని తెలియజేశారు.
ఇది కూడా చదవండి: జైసల్మేర్‌లోని అటవీ ప్రాంతంలో భారీగా మంటలు చెలరేగాయి. వీటిని అదుపు చేసేందుకు చర్యలు కొనసాగుతున్నాయి.