అక్షరటుడే, వెబ్డెస్క్ : Iran Attack on Ship | ఒమన్ (Oman) తీరంలోని హర్ముజ్ (Hormuz) జలసంధిలో సైప్రస్ జెండా కలిగిన వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఒక భారతీయుడు గల్లంతయ్యాడు. నౌకలో ఉన్న 11 మంది భారతీయులలో 10 మందిని ఇప్పటివరకు రక్షించగా, ఒకరు గల్లంతయ్యారని భారత ప్రభుత్వం ధృవీకరించింది.
ఒమన్ తీరంలో వాణిజ్య నౌకపై ఆదివారం ఉదయం ఇరాన్ దాడి చేసింది. ఈ దాడిని భారత విదేశాంగ శాఖ ఖండించింది. ఒమన్లోని భారత రాయబార కార్యాలయం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోందని, కొనసాగుతున్న గాలింపు మరియు సహాయక చర్యల కోసం ఒమన్ అధికారులతో సమన్వయం చేసుకుంటోందని ఆ ప్రకటన పేర్కొంది.
Iran Attack on Ship | తీవ్ర ఆందోళనకరం
ఇరాన్ సూచించిన మార్గంలో కాకుండా ఒమన్ తీరం నుంచి వెళ్లినందుకు GFS గెలాక్సీ నౌకపై టెహ్రాన్ దాడి చేసింది. ఈ ఘటనలో షిప్ దెబ్బతింది. ఇరాన్ సముద్ర చమురు కీలక మార్గమైన హర్ముజ్ జలసంధిని మూసివేయగా, అమెరికా కొత్త విడత దాడులను ప్రారంభించింది. దీంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి.నౌకలపై కొనసాగుతున్న దాడులు తీవ్ర ఆందోళనకరమని భారత్ అభివర్ణించింది. తక్షణమే ఉద్రిక్తతలను తగ్గించాలని పిలుపునిచ్చింది. దౌత్యపరమైన పరిష్కారం కోసం కొనసాగుతున్న చర్చలను ముగించాలని సూచించింది. నౌకపై దాడి అనంతరం అమెరికా కనీసం మూడు విడతలుగా దాడులు జరిపింది.
దీనిని కూడా చదవండి : SI Minor Driving | ఆరేళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్సై.. భారీగా ట్రాఫిక్ జామ్