Jaggareddy Comments | రక్తం చిందించే ధైర్యం హరీశ్​రావుకు లేదు : జగ్గారెడ్డి

రక్తం చిందించే ధైర్యం హరీశ్​ రావుకు లేదని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఉద్యమ సమయంలో పెట్రోల్‌ పోసుకున్నాడు కానీ.. అగ్గిపెట్టె మరిచిపోయారని విమర్శించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jaggareddy Comments | రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఓ వైపు రైతులు సాగు నీరు లేక ఇబ్బందులు పడుతుంటే.. రక్తం చుట్టూ రాజకీయాలు సాగుతున్నాయి.

సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) శనివారం మాట్లాడుతూ.. బీఆర్​ఎస్​ నాయకులను కోసి ఆ రక్తం పంటలకు పారిస్తే పండుతాయని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీఆర్​ఎస్​ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. రైతులకు నీళ్ల కోసం తాము రక్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని కేటీఆర్​, హరీశ్​రావు ఇప్పటికే స్పష్టం చేశారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్​ సీనియర్​ నేత జగ్గారెడ్డి స్పందించారు. రక్తం చిందించే ధైర్యం హరీశ్​ రావుకు లేదన్నారు.

Jaggareddy Comments | అగ్గిపెట్టే మర్చిపోయాడు

ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్‌ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని జగ్గారెడ్డి తెలిపారు. హరీశ్​రావు (Harish Rao) సంస్కృతి అదికాదన్నారు. ఉద్యమ సమయంలో పెట్రోల్‌ పోసుకున్నాడు కానీ.. అగ్గిపెట్టె మరిచిపోయారని విమర్శించారు. హింసకు కేరాఫ్‌ అడ్రస్‌ కేసీఆర్‌ ఇల్లు అని ఆరోపించారు. ఈటల అప్పుడు ఆర్థిక మంత్రి కాబట్టి బీఆర్‌ఎస్‌ వాళ్లను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లోగజ్వేల్, సిద్దిపేట కాంగ్రెస్​ గెలుపు కోసం ప్రయత్నిస్తామన్నారు. అక్కడ బీఆర్ఎస్​కు పట్టు ఉందన్నారు. గెలుపు అంత ఈజీ కాదని, అయితే తాము ప్రయత్నం చేస్తామన్నారు. ఒకవేళ అదిష్టానం తనను సిద్దిపేటలో పోటీ చేయమని ఆదేశిస్తే అక్కడే ఉంటానని స్పష్టం చేశారు.

Jaggareddy Comments | ఎమ్మెల్యేలకు ప్రాధాన్యం

jaggareddy 3

తుంగతుర్తి (Tungaturti) నియోజకవర్గంలో ఇటీవల కాంగ్రెస్​లో వర్గపోరు నెలకొన్న విషయం తెలిసిందే. ఎంపీ చామల కిరణ్​కుమార్​రెడ్డి అనుచరులపై ఎమ్మెల్యే మందుల సామేల్ వర్గం దాడి చేసింది. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు పరిశీలకుడిగా పార్టీ జగ్గారెడ్డిని నియమించింది. ఈ మేరకు ఆయన ఇరువర్గాల నేతలతో సమావేశం నిర్వహించారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. వ్యవస్థలో మొదటగా ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఆ తర్వాత ఎంపీకి, డీసీసీకి ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు.

దీనిని కూడా చదవండి : KTR Comments Revanth | నీళ్లు అడిగితే నెత్తురు చల్లుతా అంటావా.. సీఎంపై కేటీఆర్​ ఆగ్రహం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *