అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Eatala Rajender | గోదావరి జలాల తరలింపుపై మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం అవాకులు చవాకులు పేలుతున్నారని విమర్శించారు. రిటైర్డ్ ఇంజనీర్ల పట్ల మాట్లాడిన మాటలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
సోమాజిగూడ (Somajiguda) ప్రెస్‌క్లబ్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఈటల మాట్లాడారు. 2023లో లక్ష్మీ బ్యారేజీ (Laxmi Barrage) పిల్లర్లు కుంగిపోయాయన్నారు. ఇంజనీర్లు తప్పు డిజైన్ ఇస్తే వారిని, కాంట్రాక్టర్ తప్పు చేస్తే వారిని, పాలకులు అహంకారంతో ఇంజనీర్లను, కాంట్రాక్టర్లను ఇన్ఫ్లుయెన్స్ చేశారని ప్రూవ్ అయితే వారిని శిక్షించాలన్నారు. కానీ రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదని పేర్కొన్నారు. సమైక్యాంధ్రలో కూడా సీఎంలు సంయమనంతో సమాధానం చెప్పారు. కానీ మన సీఎం ఇలా మాట్లాడడం ప్రజలను కుంగదీస్తుందన్నారు.
Eatala Rajender | గుణపాఠం చెబుతారు
ఈరోజు ప్రజలు మాట్లాడకపోవచ్చు, కానీ సందర్భం వచ్చినప్పుడు కర్రుకాల్చి గుణపాఠం చెప్తారని ఈటల రాజేందర్ అన్నారు. ఎల్‌నినోతో కరువు వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నా.. సీఎం స్పందించకపోవడం సరికాదన్నారు. కన్నెపల్లి వద్ద నీళ్లు వృథాగా పోతున్నాయని, ఆ నీటిని ఎత్తిపోయాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో కూడా మొండిగా, గుడ్డిగా, అజ్ఞానంగా సీఎం వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
దీనిని కూడా చదవండి : Devadula Project | దేవాదుల ద్వారా 22 రిజర్వాయర్లు నింపుతాం : డిప్యూటీ సీఎం భట్టి