Kamareddy GGH | జీజీహెచ్​లో ప్రైవేట్ అంబులెన్స్ బీభత్సం.. హతాశులైన రోగులు..

ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ ప్రైవేట్ అంబులెన్స్ బీభత్సం సృష్టించింది.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy GGH | ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ ప్రైవేట్ అంబులెన్స్ (Private Ambulance) బీభత్సం సృష్టించింది. ఆస్పత్రిలోకి వేగంగా వచ్చి జనరేటర్​ను ఢీకొట్టింది. ఈ ఘటన కామారెడ్డి (kamareddy) జీజీహెచ్​లో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Kamareddy GGH | కామారెడ్డి పట్టణంలోని..

కామారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్ అంబులెన్స్ జీజీహెచ్​ బయట ఉంటుంది. కాగా, ఆదివారం అర్ధరాత్రి సమయంలో అంబులెన్స్ డ్రైవర్​ను పక్కకు జరిపి ఓ ఆటో డ్రైవర్ అంబులెన్స్ డ్రైవింగ్ సీట్లో కూర్చుని వాహనం స్టార్ట్ చేశాడు. ఒక్కసారిగా దూసుకెళ్లిన అంబులెన్స్ ఆస్పత్రిలో ఉన్న జనరేటర్​ను బలంగా ఢీకొంది.

ఈ ఘటనలో జనరేటర్ డ్యామేజ్​ అయింది. ప్రమాదం జరిగిన సమయంలో భారీ శబ్దం రావడంతో ఆస్పత్రిలో ఉన్న రోగులు భయాందోళనలకు గురయ్యారు. స్థానిక ప్రజలు, సిబ్బంది పరుగులు తీశారు. ప్రస్తుతం జనరేటర్ రిపేర్ చేయిస్తున్నారు. ఈ ఘటనపై ఆస్పత్రి వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టుగా తెలుస్తోంది.

ggh kamareddy

ఇది కూడా చదవండి: పవన్ కళ్యాణ్​ను పరామర్శించిన మహారాష్ట్ర సీఎం 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *